Russian Businessman Offered One Million Us Dollars Bounty On Vladimir Putin
Russian businessman Offered 1 million Dollars bounty on Putin : యుక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రపంచదేశాలన్ని ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఈయుద్ధాన్ని ఆపాలని చెబుతోంది. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తన సేనలతో యుక్రెయిన్ ను అతలాకుతలం చేస్తునే ఉన్నారు. ఈక్రమంలో రష్యాలోని ఓ శ్రీమంతుడు సైన్యానికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ‘పుతిన్ తల నరికితే ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను’అని ప్రకటించాడు. రష్యాలో రాజకీయ ఒత్తిళ్లతో రష్యాను వదిలి అమెరికాలో ఉంటున్న అలెక్స్ కొనానిఖిన్ అనే వ్యాపారవేత్త ఈ సంచలన ప్రకటన చేశాడు. పుతిన్ ను కొనానిఖిత్ ఒక యుద్ధ నేరస్తుడుగా పేర్కొన్నాడు. అంతేకాదు..‘అటువంటి యుద్ధ నేరస్తుడైన పుతిన్ ను అరెస్ట్ చేసినా లేదా హత్య చేసినా ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను’అని సైన్యానికి ఆఫర్ చేశాడు. ఫేస్‌బుక్ వేదికగా వ్యాపారవేత్త కొనానిఖిత్ ఈ బహిరంగ ప్రకటన చేయడం విశేషంగా మారింది. ఈ కుబేరుడి ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Also read : Roman Abramovich : పుతిన్‌తో సంబంధాలు.. రష్యన్ బిలియనీర్‌కు చిక్కులు…!
రష్యాకు చెందిన కొనానిఖిన్ అమెరికాలో పలు వ్యాపారాల్లో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఎంత సంపాదించినా స్వదేశంలో ఉన్న ఆనందం వేరు. కానీ రష్యా వెళ్లటానికి అతనికి ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. దీంతో పుతిన్ పై బాగా కక్ష పెంచుకున్నట్లుగా ఉన్నాడు అమెరికాలో వ్యాపారాల్లో బాగా ఆరి తేరిన కొనానిఖిన్.
అమెరికాలో స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టిన కొనానిఖిన్ క్రిప్టో ఇన్వెస్టర్‌గా బాగా ఫేమస్ అయ్యారు. అతని సంపద విలువ 300 మిలియన్ డాలర్లు. తను సంపాదించిన డబ్బులో ఒక మిలియిన డాలర్లు పుతిన్ హత్య చేయటానికి ఉపయోగిస్తానంటున్నాడు. పుతిన్ పై ఉన్న తన ఆగ్రహాన్ని ప్రకటనద్వారా వెళ్లగ్రక్కాడు.రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి వ్యతిరేకంగా గళం విప్పాడు. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ చేతులు కట్టుకుని ఉండలేనంటున్న ఈ వ్యాపారవేత్త పుతిన్ ను హత్య చేసినా..అది సాధ్యంకాకపోతే అరెస్ట్ చేసినా ఒక మిలియన్ డాలర్లు ఇస్తాను అంటూ సంచలన ప్రకటన చేశాడు.
Also read : Supreme Court:యుక్రెయిన్ పరిస్థితులు బాధాకరం..కానీ యుద్ధం ఆపేయమని పుతిన్‌ను ఆదేశించగలమా? : ఎన్వీ రమణ
ఫేస్‌బుక్‌లో కొనానిఖిన్ చేసిన పోస్టులో…ఇలా ఉంది.. పుతిన్ రష్యా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి స్వేచ్ఛాయుత ఎన్నికలు లేకుండా చేశాడు. తనని తాను జీవితకాల అధ్యక్షుడిని చేసుకున్నాడు. దీంతో విర్రవీగుతున్నాడు. గతంలో ఉన్నట్లుగా కాకుండా నియంతగా వ్యవహరిస్తున్నాడు. అన్యాయంగా యుక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి వేల మంది ప్రాణాలు తీసే రాక్షసుడిగా మారాడు.
ఒక రష్యన్ పౌరుడిగా నా దేశాన్ని నాజియిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది.. అందుకే యుద్ధ నేరసుడు పుతిన్‌ని అరెస్ట్ చేసినా లేదా చంపిన సైనికులు, అధికారులకు వన్ మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించానను తెలిపాడు. అంతేకాదు తమ దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న యుక్రెయిన్ పౌరులకు నా సెల్యూట్ అంటూ తన మద్దతు ప్రకటించాడు కొనానిఖిన్.
Read Also : Russia-Ukraine War : చైనా చూస్తోంది.. ఇక తైవాన్‌పైనే దండయాత్ర.. బాంబు పేల్చిన ట్రంప్!
రష్యాలో పలు రాజకీయ ఒత్తిళ్ల వల్ల కొనానిఖిన్ 1992లో రష్యాను వదిలి అమెరికా వచ్చి పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి బాగా సంపాదించాడు. రష్యాను వీడిన కొనానిఖిన్ 1999 నుంచి అమెరికాలో ఆశ్రయం పొందుతున్నాడు. అమెరికాలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలతో కొనానిఖిన్ కు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చిన అమెరికాలోనే తలదాచుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న కొనానిఖిన్ కు పుతిన్ పై ఉన్న ఆగ్రహావేశాలను ఇలా తన బహుమతి రూపంలో ప్రకటించి సంచలనంగా మారాడు.