Russia-Ukraine War : చైనా చూస్తోంది.. ఇక తైవాన్‌పైనే దండయాత్ర.. బాంబు పేల్చిన ట్రంప్!

Russia-Ukraine War : ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. యుక్రెయిన్ తర్వాత చైనా తైవాన్ పైనే దండయాత్ర అంటూ బాంబు పేల్చారు.

Russia-Ukraine War : చైనా చూస్తోంది.. ఇక తైవాన్‌పైనే దండయాత్ర.. బాంబు పేల్చిన ట్రంప్!

Ukraine Russia War Ukraine Kept Indian Students As Hostages In Kharkiv (2)

Russia-Ukraine War : యుక్రెయిన్ , రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలతో ముందుకు వచ్చినప్పటికీ విఫలమయ్యాయి. రష్యా మాత్రం యుక్రెయిన్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ ఆక్రమించుకునేంతవరకు రష్యా యుద్ధాన్ని ఆపే పరిస్థితులు కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో యుక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. రష్యాను ఒకవైపు పొగుడుతూనే మరోవైపు పుతిన్‌కు చురకలు అంటిస్తున్నారు ట్రంప్. ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. యుక్రెయిన్ తర్వాత చైనా తైవాన్ పైనే దండయాత్ర అంటూ బాంబు పేల్చారు.

రష్యా దండయాత్రను చైనా కూడా గమనిస్తూనే ఉందని, గతంలో అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా ఎలా వైదొలగాల్సి వచ్చిందో అదే పరిస్థితి తైవాన్‌కు ఎదురయ్యే గడ్డు పరిస్థితులు రాబోతున్నాయని ముందే ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్‌ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తదుపరి దండయాత్ర తైవాన్‌పై జరిగే అవకాశం ఉందన్నారు.

ఈ విషయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి.. జిన్‌పింగ్‌ చాలా తెలివైన వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించారు. అఫ్ఘానిస్తాన్‌ను అమెరికా ఎలా వదులుకోవాల్సి వచ్చిందో చైనా జిన్ పింగ్ గమనించే ఉంటారని ట్రంప్ తెలిపారు.

Russia Ukraine War China Is Watching, Taiwan Is Next, Says Donald Trump Amid Russia Ukraine War

Russia Ukraine War China Is Watching, Taiwan Is Next, Says Donald Trump Amid Russia Ukraine War

Russia-Ukraine War : జో బైడెన్‌పై ట్రంప్ విమర్శలు : 
ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ విషయంలో అమెరికా ఎదుర్కొన్న అనుభవాల నుంచి జిన్ పింగ్ పాఠాలు నేర్చుకోవాలని పరోక్షంగా ట్రంప్ హెచ్చరించారు. అంతటితో ఆగలేదు… ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అగ్ర రాజ్యం అమెరికా మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు.

అందుకే తమ నాయకులను ప్రపంచ దేశాల నేతలు అసమర్థులుగా చూస్తున్నారని, అందుకే వారు చేయాలనుకున్నది భయం లేకుండా చేస్తున్నారని ట్రంప్ విమర్శించారు. ఈ పరిస్థితుల్లోనే తైవాన్‌పై దాడి జరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్టు ట్రంప్ జ్యోస్యం చెప్పారు. ఇక ఇది వారి సమయమేనని ట్రంప్ అన్నారు.

ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్ పైన దండయాత్ర ప్రారంభించింది. రష్యా యుక్రెయిన్ పై దండయాత్ర ప్రభావం భవిష్యత్తులో చాలా దేశాలపై పడే అవకాశం ఉందన్నారు ట్రంప్. ఇదంతా గమనిస్తున్న చైనా రాబోయే రోజుల్లో తైవాన్ పై దండెత్తేందుకు ప్లాన్ చేయనున్నట్టు ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్-వెన్ (Tsai Ing-wen) తీవ్రంగా ఖండించారు.

ఉక్రెయిన్‌పై దండయాత్ర.. దాన్ని సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుందని, ప్రాంతీయ ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని క్షీణింప చేస్తుందని తైవాన్ అధ్యక్షరాలు అన్నారు. యుక్రెయిన్‌లోని పరిస్థితి తైవాన్‌లో ఉన్నదానికంటే ప్రాథమికంగా భిన్నంగా ఉందన్నారు.  తైవాన్ సొంత ప్రత్యేక భౌగోళిక ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. ఎలాంటి ఆకస్మిక పరిస్థితులు ఎదురైన సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తైవాన్ సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.

Read Also : Donald Trump: నేనే అధికారంలో ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు – ట్రంప్