Russia ukraine war : మెలిటోపోల్ మేయర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా సేనలు..ఇది యుద్ధ నేరం అంటూ జెలెన్‌స్కీ మండిపాటు

దక్షిణ యుక్రెయిన్ లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడెరోవ్‌ను రష్యా దళాలు కిడ్నాప్ చేసాయి. ఈ కిడ్నాప్ పై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Russia Ukraine War Melitopol Mayor Kidnapped

Russia ukraine war : Melitopol mayor kidnapped  : రష్యా-యుక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈరోజుకు 17 రోజులుగా యుద్దాన్ని చేస్తునే ఉంది. ఈ క్రమంలో రష్యా సేనలు బాంబులు దాడులతో విరుచుకుపడుతున్నారు. నగరాలకు నగరాలను నేలమట్టం చేస్తున్నారు. ఈక్రమంలో తమకు సహకరించటంలేదని ఓ నగర మేయర్ ను రష్యా సేనలు కిడ్నాప్ చేశాయి. ఈ కిడ్నాప్ పై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా మండిపడ్డారు. ఇటువంటి చర్యలు అక్రమం అని..యుద్ధ నేరం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also read : Russia Forces : యుక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లోకి ప్రవేశించిన ర‌ష్యా బ‌ల‌గాలు

యుక్రెయిన్ లో యుద్ధంతో లక్షలాదిమంది ప్రజలు యుక్రెయిన్‌ను విడిచి వలసపోతున్నారు. ఇప్పటికే యుక్రెయిన్ లోని పలు నగరాలు రష్యా సైన్యం అధీనంలోకి వెళ్లిపోయాయి. మెలిటోపోల్, ఖేర్సన్, బెర్డీయాన్స్క్, స్టారోబిలిస్క్, నోవోప్స్‌కోవ్ వంటి నగరాలు ప్రస్తుతం రష్యన్ దళాల నియంత్రణలో ఉన్నాయి. అయితే ఆయా నగరాల పౌరులు మాత్రం రష్యన్ సేనలను ఎదిరిస్తూనే ఉన్నారు.
యుక్రెయిన్ దక్షిణ నగరమైన మెలిటోపోల్ రష్యన్ సేనల నియంత్రణలోకి వెళ్లి చాలా రోజులే అయ్యింది. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సోషల్ మీడియా సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆయా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

Also read : Russia Ukraine War : యుక్రెయిన్‌పై పుతిన్ కొత్త వ్యూహం.. ఆయుధాలు ఇస్తామంటూ జనాలకు ఆఫర్..!

పరిస్థితులు ఇలా ఉంటే ..తాజాగా దక్షిణ యుక్రెయిన్ లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడెరోవ్‌ను రష్యా దళాలు కిడ్నాప్ చేసాయి. అజ్ఞాతంలో ఉన్న ఆయన రష్యా సేనలకు సహకరించేందుకు నిరాకరించడంతో కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రష్యా దళాలకు సహకరించేది లేదని ఇవాన్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో మేయర్ రష్యా సేనలు కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది.

వారు తమకు సాయం చేయడం లేదని, తాము కూడా వారి సాయాన్ని అర్థించబోమని ఇవాన్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఇవాన్ కిడ్నాప్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంపై ఇది యుద్ధ నేరమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.