Russia Ukraine War : యుక్రెయిన్‌కు భారీ విరాళమిచ్చిన స్టార్‌ హీరో.. ఆయన ఎవరంటే?

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణతో యుక్రెయిన్ చిన్నాభిన్నమైపోయింది. రష్యా దాడులతో ఆర్థికంగా చితికిపోయింది.

Russia Ukraine War Leonardo Dicaprio Donates $10 Million To Support Ukraine

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణతో యుక్రెయిన్ చిన్నాభిన్నమైపోయింది. రష్యా దాడులతో ఆ దేశ పౌరుల్లో వేలాది మంది సురక్షిత దేశాలకు తరలిపోయారు. ప్రపంచ దేశాలు హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు యుక్రెయిన్ కూడా రష్యా చర్యలకు తలొగ్గడం లేదు.

ఈ నేపథ్యంలో వేలాది మంది పరస్పర దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. రష్యా దాడులతో యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలో హాలీవుడ్‌ స్టార్‌, ‘టైటానిక్‌’ హీరో లియొనార్డో డికాప్రియో యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాడు. రష్యా యుద్ధం కారణంగా ఆర్థికంగా చితికిపోయిన యుక్రెయిన్‌కు లియినార్డో తన వంతు ఆర్థిక సాయాన్ని అందించాడు. అక్షరాలా 10 మిలియన్ డాలర్లు (రూ.76 కోట్లకు పైగా) భారీ విరాళంగా అందించాడు.

హాలీవుడ్ హీరో అయి ఉండి.. యుక్రెయిన్‌కు ఆర్థిక సాయం చేయడమేంటి అంటే.. లియినార్డోకు యుక్రెయిన్‌లోని క్రెయిన్‌తో చాలా మంచి అనుబంధం ఉంది. తన అమ్మమ్మగారు పుట్టింది ఇక్కడేనట.. యుక్రెయిన్ లోని ఒడెస్సాలో హెలెన్ ఇండెన్
బిర్కెన్ జన్మించారట.. అయితే, 1917లో పేరంట్స్ తో కలిసి జర్మనీకి వలసగా వెళ్లింది. అక్కడే పెళ్లి చేసుకుని లియినార్డో అమ్మమ్మ స్థిరపడిపోయింది. 1943లో జర్మనీలోనే లియొనార్డో తల్లి ఇర్మెలిన్‌కు అమ్మమ్మ బిర్కెన్ జన్మనిచ్చింది. ఏడాది
వయస్సు ఉన్న సమయంలోనే లియొనార్డో తల్లిదండ్రులు విడిపోయారు.

అప్పటినుంచి లియొనార్డో అమ్మమ్మతోనే ఉండేవాడు. ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. లియొనార్డో ప్రతి సినిమా రిలీజ్ ప్రీమియర్ కు ఆమె వెళ్తుండేది. లియొనార్డో యాక్టింగ్ కెరీర్‌కు అమ్మమ్మ బిర్కెన్ చాలా సపోర్టు చేస్తుండేది. అయితే
హెలెన్ తన 93వ ఏటా 2008లో కన్నమూసింది. అమ్మమ్మ పుట్టిన ఊరు కావడంతో ఆ మమకారంతోనే లియొనార్డో యుక్రెయిన్‌కు రూ.77 కోట్ల వరకు భారీ విరాళాన్ని ప్రకటించాడు.

Read Also : Ukraine Russia War: అమెరికా ఉక్రెయిన్‌లో ప్లేగు, ఆంత్రాక్స్ బయో ల్యాబ్ లను నడుపుతోంది: రష్యా