Russia-Ukraine war : ఉక్రెయిన్‌పై పట్టు కోసం రష్యా ‘త్రిశూల వ్యూహం’..!!
త్రిశూల వ్యూహం..యుక్రెయిన్‌పై పట్టుసాధించేందుకు రష్యా అనుసరిస్తున్న విధానం ‘త్రిశూల వ్యూహం’ . ఈ వ్యూహంతో రష్యా యుక్రెయిన్ పై విరుచుకుపడుతోంది.

Russia Ukraine War ..trishula Vyuham
Russia-Ukraine war ..trishula vyuham: త్రిశూల వ్యూహం..యుక్రెయిన్‌పై పట్టుసాధించేందుకు రష్యా అనుసరిస్తున్న విధానం ‘త్రిశూల వ్యూహం’ ఇప్పటికే యుక్రెయిన్‌ను భూమార్గం, వాయి మార్గం, జల మార్గం వంటి మూడు వైపుల నుంచి చుట్టుముట్టిన రష్యా సేనలు.. పక్కా ప్లాన్ ప్రకారం యుక్రెయిన్ పై రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. యుక్రెయిన్‌ను ఊపిరిపీల్చుకోనీయకుండా రష్యా ఫైటర్ జెట్స్ యుక్రెయిన్ ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌పోర్ట్‌లపై అటాక్ చేస్తోంది. విద్యుత్ వ్యవస్థనూ కుప్పకూల్చుతోంది. ఉక్రెయిన్ భూభాగంపై ఇప్పటికే వేలాది మంది రష్యా పారా ట్రూపర్లు ల్యాండ్ అయ్యారు.
మరోవైపు యుక్రెయిన్ సరిహద్దుల్లోకి ఎంటరైన రష్యా యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు కీవ్వైపు దూసుకుపోతున్నాయి. మరోవైపు రష్యా తీర జలాల్లో రష్యన్ నేవీ కూడా ఇప్పటికే మోహరించి రెడీగా ఉంది. దాడులు చేయడానికైనా.. ఎలాంటి ప్రతిదాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది రష్యన్ నేవీ. ఇప్పటికే యుద్ధ విన్యాసాలతో జోష్ మీద ఉంది రష్యా నేవీ.
రోజురోజుకీ ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం పెరుగుతూనే పోయి యుద్ధానికి దారి తీసింది. ప్రపంచ దేశాలు రష్యా తీరును వ్యతిరేకిస్తున్నా తగ్గేదేలేదుంటూ యుద్ధంతో యుక్రెయిన్ ను అతలాకుతలం చేస్తోంది. యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, మందుగుండు సామాగ్రి, వైమానిక శక్తి వంటి అన్ని భద్రతా వనరులతో రష్యా దాడులు చేస్తోంది.
యుక్రెయిన్ ను సుమారు 1.30,000 మంది రష్యన్ సైనికులు చుట్టుముట్టారు. యుక్రెయిన్ పై దండయాత్రకు 70 శాతం బలగాలను పుతిన్ వాడుతున్నారు. త్రిశూల వ్యూహం తో ఉక్రెయిన్ పై విరుచూపడుతున్న రష్యా ధాటికి ప్రతి దాడులు చేస్తోంది యుక్రెయిన్. కానీ పూర్తి స్థాయిలో నిలువరించలేకపోతోంది.
రెండు లక్షల సైన్యంతో ఉక్రెయిన్ లోని నగరాలను అక్రమించుకుంటున్న రష్యా సేనలు పేలుళ్లతో దద్దరిల్లిపోయేలా చేస్తున్నారు. ఉక్రెయిన్ రాజధాని ,ఇతర నగరాలపై దాడులు చేస్తున్నారు. దీంతో యుక్రెయిన్ కు సహాయంగా నాటో బలగాలు కూడా రష్యా సేనలపై పోరాడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నాటో పెత్తనం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్..