Russia-Ukraine war : యుక్రెయిన్ ఎయిర్ బేస్,ఎయిర్ డిఫెన్స్ లను ధ్వంసం చేశామని ప్రకటించిన రష్యా
యుక్రెయిన్ ఎయిర్ బేస్, ఎమర్ డిఫెన్స్ లను ధ్వంసం చేశామని రష్యా అధికారికంగా ప్రకటించింది.

Russia Say Destroyed Ukraine Airbases And Ari Defences
Russia-Ukraine war : యుక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యా బాంబులతో విలయతాండవం చేస్తోంది. రష్యా యుక్రెయిన్ మద్య యుద్ధం అతి తక్కువ సమయంలోనే తీవ్రస్థాయికి చేరింది. ఉక్రెయిన్లోకి రష్యా సైన్యం చొరబడినట్లు ఉక్రెయిన్ సరిహద్దు రక్షణ ఏజెన్సీ అధికారికంగా ప్రకటన చేసింది. అంతేకాదు..ఉక్రెయిన్ ఎయిర్ బేస్, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. మరోపక్క యుక్రెయిన్ కూడా తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. సాధ్యమైనంత వరకు ప్రతిఘటిస్తోంది. ఇప్పటికే రష్యాకు చెందిన పలు విమానాలకు యుక్రెయిన్ కూల్చివేసింది. కానీ రష్యా ధాటికి నిలవరించుకోలేకపోతోందని చెప్పాలి.
Also read : Ukraine Ambassador : యుక్రెయిన్ వ్యవహారంలో భారత్ జోక్యం చేసుకోవాలి : రాయబారి
ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరుగుతోన్న ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొందరు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. మరోపక్క, ఉక్రెయిన్ సైన్యం ఏ మాత్రం బెదరకుండా తమ దేశం కోసం రష్యాపై పోరాడుతోంది. ఇప్పటికే పలు యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది.రష్యా యుద్ధం ప్రారంభించి, ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేస్తుండడంతో ఉక్రెయిన్లోని విదేశీయులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ ఎయిర్ పోర్టులను మూసివేసింది.
Also read : Russia-Ukraine Conflict : 1990లో యుక్రెయిన్ అణ్వాయుదాలను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది?
ఉక్రెయిన్ లోని విదేశీయులు తమ సొంత దేశాలకు వెళ్లని పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి నుంచి మళ్లీ పౌర విమాన ప్రయాణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎటునుంచి ఏదాడికి గురవుతామోనని భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. యుద్ధవిమానాలు,బాంబుల మోతతో పిల్లలు తల్లడిల్లిపోతున్నారు.భయపడిపోతున్నారు. దీంతో తల్లిదండ్రులు వారికి లోపల భయంగానే ఉన్నా పిల్లలకు మాత్రం ధైర్యం నూరిపోస్తున్నారు.