Russia-Ukraine War : యుక్రెయిన్ లో ఎటుచూసినా భావోద్వేగ పరిస్థితులు..పిల్లలకు ధైర్యం నూరిపోస్తున్న తల్లిదండ్రులు

రష్యా సేనలు యుక్రెయిన్ పై విరుచుకుపడుతున్నారు. దీంతో యుక్రెయిన్ లో ఎటుచూసినా భావోద్వేగ పరిస్థితులు..యుద్ధ విమానాలు మోతలతో పిల్లలు హడలిపోతుంటే ధైర్యం నూరిపోస్తున్న తల్లిదండ్రులు.

Russia-Ukraine War..Emotional conditions in the country : యుక్రెయిన్ లో ఎటుచూసినా రష్యా సైన్యం వేస్తున్న బాంబులతో దద్దరిల్లిపోతోంది. దీంతో దేశ వ్యాప్తంగా భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. బాంబుల దాడులకు..యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, యుద్ధ ట్యాంకులు మోతలతో చిన్నపిల్లలు హడలిపోతున్నారు.దీంతో తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఇటువుంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ దురాక్రమణ దిశగా రష్యా 11 నగరాల్లో దాడులు చేస్తోంది. కీవ్ ఎయిర్ పోర్ట్ స్వాధీనం చేసుకుంది.

దీంతో ప్రజల భద్రత కోసం ప్రభుత్వం ప్రజల్ని అండర్ గ్రౌండ్ ప్రాంతాలకు వెళ్లి దాక్కోవాలని పిలుపునిచ్చింది. బాంబు షెల్టర్లకు దారి చూపుతూ గోడలపై బాణం గుర్తులు వేసి మరీ దారి చూపుతున్నారు.దీంతో యుక్రెయన్ రాజధాని కీయివ్ ను ఖాళీ చేసి వెళ్తున్న జనం.. మెట్రో స్టేషన్లు, బాంబు షెల్టర్లకు జనం క్యూ కడుతున్నారు. దీంతో కిలోమీటర్లకొద్దీ కార్లు నిలిచిపోయాయి. తమ దేశానికి తమ ప్రజలకు ఏమీ కాకూడదని ప్రజలు వీధుల్లో ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

Also read : Russia-Ukraine War : స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తున్న రష్యా, యుక్రెయిన్ వార్

ఉక్రెయిన్ పై రష్యా బాంబుల దాడులతో విరుచుకుపడుతోంది. యుద్ధ విమానాలతో విలయ తాండవం చేస్తోంది. ఈ దాడులతో రాజధాని కీయివ్ దద్దరిల్లిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. ఎటుపక్క నుంచి ఏ క్షిపణి వచ్చి పడుతుందో.. ఏ బాంబు వచ్చి పేలుతుందో తెలియని దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

పిల్లలు, పెంపుడు జంతువులను తీసుకుని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కీయివ్ ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. బాంబులు, క్షిపణుల దాడి నుంచి తప్పించుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బంకర్లలోకి వెళ్తున్నారు. అందుకోసం బంకర్లకు దారెటుందో చూపిస్తూ గోడలపై ఎర్రని మార్కుతో బాణం గుర్తులేశారు. 2014లోనే ఏర్పాటు చేసిన బాంబు షెల్టర్ల అవసరం ఇప్పుడు రావడంతో.. వాటికి దారి తెలిసేలా ఫ్రెష్ గా గోడలపై పెయింటింగులు వేశారు.

Also read : Imran khan Russia Visit : యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని సమర్ధించిన ఇమ్రాన్ ఖాన్..యుద్ధం వేళ..రష్యాలో పర్యటన

దీంతో కీయివ్ లోని వీధులు, మెట్రో స్టేషన్లన్నీ జనంతో నిండిపోయాయి. వీధులన్నీ భావోద్వేగ భరితంగా మారాయి. కొందరు తలదాచుకోవడానికి మెట్రో అండర్ గ్రౌండ్ స్టేషన్లకు వెళితే.. మరికొందరు ఏ రైలు దొరికితే ఆ రైలు ఎక్కేసి సిటీని దాటి తరలిపోతున్నారు. మరికొందరు బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించారు. ఇటువంటి పరిస్థితుల్లో రైళ్లు, బస్సులు జనాలతో నిండిపోయి కనిపిస్తున్నాయి.

Also read : Russia-Ukraine war: యుక్రెయిన్ గగనతలం మూసివేత..ఖాళీగా వెనుదిరిగిన భార‌త విమానం..!

లోలోపల ఏ భయాలున్నా..పెద్దలు మాత్రం తమ పిల్లలకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఏం కాదంటూ పిల్లలకు ధైర్యం చెబుతున్న దృశ్యాలు మనస్సుల్ని కలచివేస్తున్నాయి. తమకు, తమ దేశానికి ఏమీ కాకూడదని వీధుల్లో జనాలు ప్రార్థనలు చేస్తూ కనిపించారు. ఎంతోమంది నగరాన్ని విడిచివెళ్లిపోతున్న వారి కార్లతో సిటీ రహదారులన్నీ నిండిపోయాయి. ఎటు చూసినా కిలోమీటర్లకొద్దీ కార్ల ట్రాఫిక్ కనిపించింది. కీయివ్ నుంచి సిటీ పశ్చిమ ప్రాంతానికి చాలా మంది తరలివెళ్లిపోతున్నారు. మొత్తంగా సిటీ అంతటా ఓ రకమైన భావోద్వేగ పరిస్థితులు నెలకొని మనస్సులు మెలిపెట్టేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు