Belarus
Russia Ukraine War : రష్యా-యుక్రెయిన్ మధ్య నాలుగో రోజు (ఫిబ్రవరి 27) యుద్ధం కొనసాగుతోంది. బాంబులు, క్షిపణులతో యుక్రెయిన్ పై విరుచుకుపడుతోంది రష్యా. వాసిల్కివ్ లోని ఓ చమురు డిపోపై క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో గాలి విషపూరితంగా మారే ముప్పు ఉందని అంతా భయపడుతున్నారు. అలాగే, ఈశాన్య నగరం ఓఖ్టిర్కాలోనూ రష్యా దాడులు జరపడంతో ఓ ఏడేళ్ల బాలిక సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి గవర్నర్ ప్రకటించారు.
ఇక కీవ్‌లో బాంబుల మోత వినపడుతూనే ఉంది. క్షిపణులతోనూ రష్యా దాడులు జరుపుతోంది. కీవ్ లోని అపార్ట్‌మెంట్ దగ్గరా బాంబులతో రష్యా దాడులు జరుపుతుండడంతో అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
Russia Ukraine war: సైనికుల ప్రాణాలు గాల్లో వదిలేసిన రష్యా, మెడికల్ ఎమర్జెన్సీ విధింపు
ఓవైపు యుక్రెయిన్ పై దాడులు చేస్తూనే, మరోవైపు చర్చలకు రావాలని రష్యా ఆహ్వానం పలుకుతోంది. తమ ప్రతినిధి బృందాన్ని బెలారస్ పంపిస్తామని, యుక్రెయిన్ బృందం కూడా బెలారస్ రావాలని రష్యా చెప్పింది. దీనిపై యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. రష్యాతో చర్చలకు తాము సిద్ధమే అన్నారు. అయితే చర్చలకు వేదికగా బెలారస్ తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.
Russia Ukraine War Ukraine rejects Russian offer of talks in Belarus, leaves door open in other locations
ప్రస్తుతం రష్యా దురాక్రమణకు బెలారస్ ఎంతో సహకరిస్తోందని, రష్యా అక్కడి నుంచే దాడులకు పాల్పడిందని, అలాంటి చోట తాము చర్చలు జరపబోమని జెలెన్ స్కీ చెప్పారు. వార్సా, బ్రటిస్లావా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బాకు… ఈ ప్రాంతాల్లో ఎక్కడ చర్చలు జరిపినా తమకు సమ్మతమేనని వివరించారు. యుక్రెయిన్ కు వ్యతిరేకం కాని దేశాల్లోనే తాము చర్చలు జరుపుతామని వెల్లడించారు.
రష్యా దాడులు అత్యంత కిరాతకమని, సాధారణ పౌరుల ఆవాసాలను సైతం ధ్వంసం చేస్తోందని జెలెన్ స్కీ ఆరోపించారు. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నట్టు ప్రకటించిన రష్యా అందుకు విరుద్ధంగా పౌర సముదాయాలపై బాంబుల వర్షం కురిపిస్తోందని వాపోయారు.
Russia Ukraine War : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు
యుక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు నడుస్తోంది. నాలుగో రోజూ యుక్రెయిన్‌పై మిస్సైళ్లతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రాజధాని నగరం కీవ్‌లోకి ప్రవేశించేందుకు రష్యా సైన్యం యత్నిస్తోంది. యుక్రెయిన్ గ్యాస్, చమురు నిక్షేపాలు టార్గెట్ గా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. కార్కివ్‌లోని గ్యాస్ పైప్‌లైన్‌ను రష్యా బలగాలు పేల్చేశాయి. కాగా, యుక్రెయిన్ సైనికులు తగ్గేదేలే అన‍్నట్టుగా తమ పోరాట పటిమను చూపిస్తున్నారు. శక్తివంచన లేకుండా రష్యా దళాలను తిప్పికొడుతున్నారు.