Russia-Ukrainian war :యుక్రెయిన్ వదిలిపోతూ..సూట్‌కేసుల నిండా డబ్బుల కట్టలతో దొరికిపోయిన మాజీ ఎంపీ భార్య

యుక్రెయిన్ మాజీ ఎంపీ భార్య దేశం వదిలిపోయేందుకు యత్నించారు. అలా సూట్ కేసుల నిండా 28 మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ యూరోలతో దేశం దాటిపోయేందుకు యత్నించి దొరికిపోయారు.

Former Ukrainian MPs wife tries to flee country with 28 million dollars : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటున్న వేళ ప్రాణాలు కాపాడుకోవటానికి కట్టు బట్టలతో దేశం విడిచిపోయేవారు కొందరైతే..ఓ మాజీ ఎంపీ భార్య మాత్రం మిలియన్ల డాలర్ల డబ్బుల కట్టలతో యుక్రెయిన్ నుంచి పారిపోవటానికి యత్నించి అడ్డంగా దొరికిపోయింది. యుక్రెయిన్ మాజీ ఎంపీ కోట్విట్స్కీ భార్య యుక్రెయిన్ సరిహద్దుల్లో సూట్ కేసుల నిండా 28 మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ యూరోలతో దేశం దాటిపోయేందుకు యత్నించి దొరికిపోయింది. సూట్‌కేసులతో దేశం దాటేందుకు ప్రయత్నించే క్రమంలో దొరికిపోయింది. జకర్‌పట్టియా ప్రావిన్స్ మీదుగా హంగేరీకి చేరుకోవాలని ప్రయత్నించిన మాజీ ఎంపీ భార్య హంగేరీ బోర్డర్ గార్డ్స్‌కు దొరికిపోయారు.

ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది రష్యా. అలా రోజు రోజుకు యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. నగరాలను నేలమట్టం చేస్తోంది. హైపర్ సోనిక్ క్షిపణులను కూడా ప్రయోగిస్తోంది. మరోవైపు వల్ల యుక్రెయిన్ నుంచి ఎంతోమంది ప్రజలు పొరుగు దేశాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. అలా ఇప్పటి వరకు యుక్రెయిన్ నుంచి 10 మిలియన్ల మంది వలస వెళ్లినట్లుగా లెక్కలు తెలియజేస్తున్నాయి. వీరిలో 3.4 మిలియన్ల మంది పొరుగు దేశాలైన పోలాండ్, స్లోవేకియా, రొమేనియా, హంగేరీ వంటి దేశాలకు వెళ్లారు. మరోవైపు తమ ప్రాణాలు పోయినా ఫరవాలేదనుకుంటున్న యుక్రెయిన్ పౌరులు తమ ఆత్మీయులను దేశాల సరిహద్దులు దాటించి తాము మాత్రం యుద్ధంలో పాల్గొంటున్నారు. అలా రష్యా యుద్ధంలో యుక్రెయిన్‌లో వందలాది మంది పౌరులు మరణిస్తున్నారు.

కానీ యుక్రెయిన్ కూడా యుద్ధంలో ఏమాత్రం తగ్గటంలేదు. శక్తికి మించి పోరాడుతోంది. అలా యుద్ధంలో రష్యా సేనలను అంతమొందిస్తోంది. ఇప్పటి వరకు 14 వేల మంది రష్యన్ సైనికులను హతమార్చినట్టు యుక్రెయిన్ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు