Roman Abramovich : పుతిన్‌తో సంబంధాలు.. రష్యన్ బిలియనీర్‌కు చిక్కులు…!
ప్రపంచమంతా ఒకవైపు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకవైపు... యుక్రెయిన్‌పై యుద్ధం వద్దన్నా పుతిన్ దాడులకు తెగబడుతున్నాడు. బిలియనీర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

Roman Abramovich Russian Billionaire Roman Abramovich Will Sell Chelsea Soccer Club And Donate Proceeds To Victims In Ukraine
Roman Abramovich : ప్రపంచమంతా ఒకవైపు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకవైపు… యుక్రెయిన్‌పై యుద్ధం వద్దన్నా తగ్గేదేలే అన్నట్టుగా పుతిన్ కఠిన నిర్ణయాలతో దాడులకు తెగబడుతున్నాడు. ప్రపంచ దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహారిస్తున్నాడు. పుతిన్ వైఖరిని మండిపడుతున్న ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. పుతిన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు ఆయనకు అనుకూలంగా ఉన్నవారిందరిని టార్గెట్ చేస్తున్నాయి పశ్చిమ దేశాలు. ప్రధానంగా రష్యా బిలియనీర్లపై ప్రపంచ దేశాలు కన్నెర్ర చేశాయి. దాంతో పుతిన్ తో సత్సంబంధాలు కలిగిన బిలియనీర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అందులో ఒకరు రష్యాకు చెందిన అబ్రామోవిచ్.. ఈయనకు చెల్సియా అనే పుట్ బాల్ క్లబ్ ఉంది. ఇంగ్లండ్ దేశంలో ఫుట్‌బాల్ ఆటకు ఫుల్ క్రేజ్… ప్రతీ క్లబ్‌కు పెద్దసంఖ్యలో అభిమానులు ఉంటారు.
ఫుల్ క్రేజ్ కలిగిన ఫుట్‌బాల్ క్లబ్స్‌లో చెల్సియా క్లబ్ ఒకటి. లండన్‌లో ఈ క్లబ్‌ని అబ్రామోవిచ్ బిలియనీర్ 2003లో కొనుగోలు చేశాడు. ఈ క్లబ్ ఎప్పుడైతే అబ్రామోవిచ్ చేతుల్లోకి వెళ్లిందో అప్పుడే ఈ క్లబ్ జాతకం మారిపోయింది. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్లో ఫుల్ క్రేజ్ అందుకుంది. 19 ఏళ్లలో ఈ క్లబ్ అనేక మ్యాచ్ ల్లో గెలిచింది. 19 ట్రోఫీలను సొంతం చేసుకుంది.

Roman Abramovich Russian Billionaire Roman Abramovich Will Sell Chelsea Soccer Club And Donate Proceeds To Victims In Ukraine
ఈ క్లబ్ విజయవంతం కావాడానికి రష్యన్ బిలియనీర్ అబ్రామోవిచ్ మూల కారణం.. అయితే ఇప్పుడు యుక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఈ ఫుట్ బాల్ క్లబ్ కు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. నాటో సభ్య దేశాలు రష్యా తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా, యూకేలు రష్యాపై తీవ్రంగా మండిపడుతున్నాయి. రష్యాపై పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యన్ దేశస్థుల అకౌంట్లను స్తంభింప చేస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు రష్యన్ సంస్థలకు సంబంధించి లావాదేవీలు నిలిచిపోయాయి.
రష్యా దాడితో.. దేశ బిలియనీర్ల జాతకం ఒక్కసారిగా మారిపోయింది. బ్యాంకు అకౌంట్లు నిలిచిపోయాయి. పుతిన్ అనుకూలంగా వ్యవహరించే అబ్రామోవిచ్పై కఠిన ఆంక్షలకు యూకే అథారిటీలు సిద్ధమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో చెల్సియా క్లబ్ నడపడమే కష్టంగా మారిందని అబ్రమోవిచ్ అంటున్నారు. చేసేది ఏమిలేక చెల్సియా క్లబ్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలు, ఆంక్షల ప్రభావం చెల్సియాపై పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అబ్రామోవిచ్ భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చెల్సియా క్లబ్ అమ్మడం తప్ప మరో మార్గం లేదని అంటున్నాడు. ఈ క్లబ్ ను కేవలం డబ్బులు కోసమో లేదా వ్యాపారం కోసమో అమ్మడం లేదన్నాడు. ఈ క్లబ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని యుక్రెయిన్ లోని బాధితులకు విరాళం అందించననున్నట్టు అబ్రామోవిచ్ చెబుతున్నాడు.
Read Also : Russia-Ukraine War : చైనా చూస్తోంది.. ఇక తైవాన్‌పైనే దండయాత్ర.. బాంబు పేల్చిన ట్రంప్!