US President Joe Biden
Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ మరో రెండు నెలలు యూఎస్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగనున్నాడు. అయితే, బైడెన్ హఠాత్తుగా యుక్రెయిన్ కు దీర్ఘశ్రేణి ఆయుధ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విమర్శలకు తావునిస్తోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ నిర్ణయం దేశాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమేనంటూ డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ కూడా విమర్శించారు. రష్యాసైతం బైడెన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
Also Read: PM Modi : బ్రెజిల్ వేదికగా జీ20 సదస్సు.. ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని మోదీ వరుస భేటీలు
బ్రెజిల్ లో జీ-20 సదస్సు జరిగింది. ఈ సద్ససులో ప్రధాని నరేంద్ర మోదీ, జోబైడెన్ సహా పలు దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా అమెజాన్ అడవులను రక్షించే విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మల్టీ మిలియన్ డాలర్ ప్లాన్ ను ప్రకటించారు. ఈ క్రమంలో మనౌస్ అనే అటవీ ప్రాంతంలో బైడెన్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడిన అనంతరం.. మీడియా ప్రతినిధులు జో బైడెన్ ను యుక్రెయిన్ కు దీర్ఘశ్రేణి ఆయుధ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రశ్నలు సంధించారు. దీంతో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా.. బైడెన్ వెనక్కి అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ముందు నుంచి వెళ్లేందుకు దారిఉన్నా బైడెన్ వెనక నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై రష్యా మీడియా బైడెన్ ను వెక్కిరిస్తూ వీడియోను షేర్ చేసింది.
‘జో ఎక్కడికి వెళ్తున్నావు’.. బైడెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగించాడు, ఎటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు, అమెజాన్ అడవిలోకి వెళ్తున్నాడు’ అంటూ బైడెన్ వెనక్కు వెళ్తున్న వీడియోను రష్యా నియంత్రణలో కొనసాగే అంతర్జాతీయ మీడియా నెట్‌వర్క్ అయిన ఆర్టీ మీడియా అధికారికంగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. మరో వీడియోలో.. జో బైడెన్ యూఎస్ అధ్యక్షుడిగా తన చివరి సెలవులను అమెజాన్ అడవుల్లో ప్లాన్ చేసుకున్నాడని ఆర్టీ మీడియా పేర్కొంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Where you going Joe?
Biden finishes press conference, answers no questions, wanders off into the Amazon Jungle pic.twitter.com/r2Hl5NoUhi
— RT (@RT_com) November 18, 2024
Joe Biden planning his final vacation as US president be like pic.twitter.com/alvs3Elz2R
— RT (@RT_com) November 17, 2024