PM Modi : బ్రెజిల్ వేదికగా జీ20 సదస్సు.. ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని మోదీ వరుస భేటీలు

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని ...

PM Modi : బ్రెజిల్ వేదికగా జీ20 సదస్సు.. ప్రపంచ దేశాధినేతలతో ప్రధాని మోదీ వరుస భేటీలు

PM Modi Meet Giorgia Meloni and Emmanuel Macron

Updated On : November 19, 2024 / 9:27 AM IST

PM Modi Brazil visit : భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారు జామున బ్రిజిల్ చేరుకున్నారు. రియో డీజెనిరోలో జరిగిన జీ-20 సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎస్, ఇటలీ, యూకే, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్, బ్రిటన్, ఫ్రాన్స్, తదితర దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో మోదీ కొద్దిసేపు చర్చించారు. అమెరికాలో ఎన్నికల అనంతరం వారిద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి. బ్రెజిల్, సింగపూర్, స్పెయిన్ దేశాధినేతలు లులా డ సిల్వా, లారెన్స్ వాంగ్, పెడ్రో శాంచెజ్ లతో మోదీ సంభాషించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తోనూ మోదీ భేటీ అయ్యారు. ఈ వివరాలను ప్రధాని స్వయంగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

Also Read: Pakistan: పాకిస్థాన్‌లో బిచ్చగాడి కుటుంబం భారీ విందు.. వీడియోలు వైరల్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన వివరాలను మోదీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘నా స్నేహితుడు, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్, ఫ్రాన్స్ లు అంతరిక్షం, ఇందనం, ఏఐ వంటి ఇతర రంగాల్లో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించాం. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపర్చేందుకు పనిచేస్తాం’ అంటూ మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కీర్ స్టార్మర్ బృందంతో భేటీ అనంతరం మోదీ తన ట్విటర్ ఖాతాలో వివరాలను వెల్లడించారు. ‘రియో డీజెనిరోలో జీ20 సమ్మిట్ సందర్భంగా బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్మార్టర్ భేటీ జరిగింది. రాబోయే కాలంలో సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో బ్రిటన్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలనుసైతం బలపర్చాలనుకుంటున్నాం’ అని ప్రధాని మోదీ తెలిపారు.

 

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. వీరి భేటీ అనంతరం మోదీ ట్విటర్ లో వివరాలను షేర్ చేశారు. ‘రియో డీ జెనీరో జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని జార్జియా మెలోనిని కలవడం చాలా ఆనందంగా ఉంది. మా చర్చలో ఇరుదేశాల రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత తదితర అంశాలలో సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. దీనితోపాటు భారత్, ఇటలీ దేశాల మధ్య స్నేహం గురించి కూడా చర్చించినట్లు మోదీ తెలిపారు.