Pakistan: పాకిస్థాన్‌లో బిచ్చగాడి కుటుంబం భారీ విందు.. వీడియోలు వైరల్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ లో ప్రస్తుతం ఓ బిచ్చగాడి కుటుంబం గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది.

Pakistan: పాకిస్థాన్‌లో బిచ్చగాడి కుటుంబం భారీ విందు.. వీడియోలు వైరల్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Pakistan Beggar Family

Updated On : November 19, 2024 / 8:26 AM IST

Pakistan Beggar Family: అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ లో ప్రస్తుతం ఓ బిచ్చగాడి గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. వామ్మో.. బిచ్చగాడి కుటుంబం అంత పనిచేసిందా.. వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ కు చెందిన ఓ బిచ్చగాడి కుటుంబం రూ.1.25 కోట్లు (పాకిస్థాన్ కరెన్సీ) వ్యయంతో ఏకంగా 20వేల మందికి విందు ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం సంప్రదాయ వంటకాలైన సిరిపాయా, మురబ్బాతో పాటు మాంసాహారంతో గ్రాండ్ మెనూ ఏర్పాటు చేశారు. రాత్రికి మటన్, స్వీట్ రైస్ తో పాటు పలు వంటకాలను వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ వీడియోలు చూసిన పాక్ ప్రజలు అవాక్కవుతున్నారు.

Also Read: Indian Aviation History : భారతీయ విమానయాన సరికొత్త రికార్డు.. ఒక్క రోజులో 5 లక్షల మంది ప్రయాణికులు..!

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఓ బిచ్చగాడి నాన్నమ్మ మరణించింది. దీంతో 40వ రోజు ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబం గుజ్రాన్ వాలాలో రాహల్ వలి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ విందును ఏర్పాటు చేసింది. తమకు తెలిసిన వారిని, స్థానికులను విందుకు ఆహ్వానించారు. వెజ్, నాన్ వెజ్ విభాగాల్లో పలు రకాల రుచికరమైన వంటకాలు విందులో అందుబాటులో ఉంచారు. దీంతో మధ్యాహ్నం, రాత్రి వేళ వేలాది మంది విందులో పాల్గొన్నారు. ఈ విందులో పాల్గొనేందుకు వచ్చిన వారికోసం 2వేల వాహనాలను అందుబాటులో ఉంచగా.. విందుకోసం 200కుపైగా మేకలను వధించారు.

 

బిచ్చగాడు కుటుంబం ఏర్పాటు చేసిన విందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ఆశర్యపోతున్నారు. ఈ క్రమంలో ప్రతీఒక్కరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. బిచ్చగాడి కుటుంబానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.