రష్యా వ్యాక్సిన్ సేఫ్ అంటున్న Lancet journal

  • Publish Date - September 5, 2020 / 06:25 AM IST

Russian COVID-19 vaccine : కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ఫుల్ బిజీగా మారిపోయాయి. రష్యా ఒక అడుగు ముందుకేసి వ్యాక్సిన్ (స్పుత్నిక్) తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేసింది. కానీ..ఎలాంటి ప్రయోగాలు జరపకుండానే..వ్యాక్సిన్ విడుదల చేసిందని శాస్త్రవేత్తలు, వైద్యులు విమర్శలు గుప్పించారు. దీంతో వ్యాక్సిన్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.


ఈ క్రమంలో..Lancet journal చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టీకా సురక్షితమేనంటూ స్పష్టం చేసింది. ప్రాథమిక ఫలితాల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు, రెండు దశల హ్యూమన్ ట్రయల్స్ లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని వెల్లడించింది.

కరోనాను అడ్డుకునే..యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని, 76 మందిపై టీకా పరిక్షించి ఫలితాలను లాన్సెట్ లో ప్రచురించారు. 21 రోజుల్లో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు, 28 రోజుల్లో టీ సెల్స్‌ ఉత్పత్తి అయినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.


వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు రకాల ఫార్ములేషన్స్‌ను పరీక్షించారు. ఒకటి ఫ్రోజెన్‌ (ఘనీభవన) కాగా, రెండోది లియోఫిలైజ్‌ (ఫ్రీజ్‌-డ్రై) ఫార్ములేషన్‌. అధ్యయనం చాలా పరిమితమని, తక్కువ మందిపై ట్రయల్స్‌ నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు.

ఫేజ్‌-1లో ఉన్నవారంతా పురుషులేనని, ఫేజ్‌-3 హ్యూమన్‌ ట్రయల్స్‌కు ఆగస్టు 26న అనుమతి లభించిందన్నారు. ఇందులో అన్ని వయో వర్గాలకు చెందిన 40,000 మందిపై ట్రయల్స్‌ నిర్వహిస్తామన్నారు.


ట్రెండింగ్ వార్తలు