కరోనా నుంచి కోలుకోక ముందే వెలుగులోకి కొత్త వైరస్

ప్రస్తుతం కోవిడ్-19(కరోనా) వైరస్ భయంతో ప్రపంచమంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతోంది. ఆ వైరస్ ప్రభావం అత్యధికంగా చైనాలోనే ఉన్నా ఇరుగు పొరుగు దేశాల్లోని వారికి

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 12:46 PM IST
కరోనా నుంచి కోలుకోక ముందే వెలుగులోకి కొత్త వైరస్

Updated On : February 13, 2020 / 12:46 PM IST

ప్రస్తుతం కోవిడ్-19(కరోనా) వైరస్ భయంతో ప్రపంచమంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతోంది. ఆ వైరస్ ప్రభావం అత్యధికంగా చైనాలోనే ఉన్నా ఇరుగు పొరుగు దేశాల్లోని వారికి

ప్రస్తుతం కోవిడ్-19(కరోనా) వైరస్ భయంతో ప్రపంచమంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతోంది. ఆ వైరస్ ప్రభావం అత్యధికంగా చైనాలోనే ఉన్నా ఇరుగు పొరుగు దేశాల్లోని వారికి నిద్ర కరవైంది. ఓవైపు కరోనా కలకలం సృష్టిస్తుండగా.. దానిపైనే ప్రపంచమంతా ఫోకస్ చేస్తున్న వేళ….మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సరికొత్త వైరస్… బ్రెజిల్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఈ వైరస్‌కు బ్రెజిల్ పురాణంలోని మత్స్యకన్య యారా పేరు పెట్టారు.

ఇలాంటి వైరస్ చూడటం ఇదే ఫస్ట్ టైమ్:
బ్రెజిల్‌లోని ఓ కృత్రిమ సరస్సులో పుట్టిన యారా వైరస్‌తో బ్రెజిల్ వాసులు కలవర పడుతున్నారు. సరస్సు నీటిలో నివసిస్తోన్న అమీబాలో ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. కొత్తగా కనుగొన్న ఈ వైరస్ జన్యువులు గతంలో బయటపడ్డ వైరస్ జన్యువులతో సరిపోలడం లేదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యారా వైరస్‌లోని 74 జన్యువుల్లో 68 జన్యువులను ఏ వైరస్‌లోనూ చూడలేదంటున్నారు శాస్త్రవేత్తలు. గ్లోబల్ సైంటిఫిక్ డేటాలోని 8వేల 500 రకాల జన్యువులతో ఈ వైరస్ జన్యువులు సరిపోలకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.

యారా మనుషులకు ముప్పా:
సముద్ర జలాలు విపరీతంగా కలుషితం అవుతుండడం వల్ల గత మూడేళ్లలో వైరస్‌లు పెరిగిపోయాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి ఏకకణ జీవి అమీబాలో కనిపించిన ఈ యారా వైరస్‌ మనుషులకు సోకలేదు. అది మనుషులకు సోకితే ప్రభావం ఎలా ఉంటుందనేది అంచనా వేయడం కూడా కష్టమవుతోంది. కరోనాకు తోడుగా యారా కూడా విజృంభిస్తే పరిస్థితి ఏంటన్న భయాందోళన నెలకొంది.

చైనాలో మరణ మృదంగం:
మరోవైపు చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే చైనాలో ఈ రాకాసి వైరస్‌ దెబ్బకు 254మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,367కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 60 వేల మందికిపైగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడగా..ఇందులో 8 వేలమందికి పైగా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోందని చైనా ప్రకటించిన సమయంలోనే మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది. రోజుకు వందలోపే మరణాలు ఉంటే నిన్న ఒక్క రోజే 250మందికి పైగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చన్న కథనాలు వస్తున్నప్పటికీ వాటిపై స్పష్టత మాత్రం లేదు.