Rare Animals : టర్కీ పర్వతాల్లో మూడు మిలియన్ ఏళ్లుగా జీవించే ఉన్న అరుదైన జంతువులు, భూగర్భంలో నివసించే ఏకైక చిన్న క్షీరదాలు
ఈ భూమిపై కోటాలను కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయి. ఎన్నో వింత వింత జంతవులు, అరుదైన జీవులను సైంటిస్టులు గుర్తిస్తున్నారు. కానీ మనిషి నీడ కూడా పడని ప్రాంతాల్లో మనిషి కంటికి కనిపించని ఇంకా ఎన్నో జీవులు ఉన్నాయి. పర్వతాల్లో జీవించే అరుదైన జీవులను కనుగొన్నారు పరిశోధకులు.

Rare Animals In Turkey Mounts
Rare mammals In Turkey Mounts : ఈ ప్రకృతిలో కోటాను కోట్ల రకాల జీవులున్నాయి. కానీ సైంటిస్టులు కూడా గుర్తించని ఇంకా ఎన్నో రకాల జీవులున్నాయి. వింత వింత జీవులు, అరుదైన జీవులు, అద్భుతనమైన జీవులు ఇలా ఎన్నో జీవజాతుల గురించి నిత్యం పరిశోధనలు చేసే సైంటిస్టులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగింజే జీవులున్నాయి. మనిషి కంటికి కనిపించని జీవులు మరెన్నో ఉన్నాయి. నీటిలో జీవించేవి కొన్ని. భూమ్మీద నివసించేవి మరికొన్ని. భూగర్భంలో నివసించే జీవులుకూడా ఉన్నాయి. అటువంటి కొన్ని అత్యంత అరుదైన జంతువులను గుర్తించారు సైంటిస్టులు.
టర్కీ పర్వతాలలో కొన్ని అరుదైన జీవుల్ని పరిశోధకులు గుర్తించారు. అవి మూడు మిలియన్ సంవత్సరాలుగా జీవించి ఉన్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. టర్కీ పర్వతాల్లో పరిశోధకులు కనుగొన్న ఈ అరుదైన జీవులు భూగర్భంలో నివసించే ఏకైక క్షీరదాలు అని గుర్తించారు. చాలా అరుదైన రెండు ‘లివింగ్ మోల్’ జంతువులను గుర్తించారు. టర్కీలోని ఒండోకుజ్ మేయిస్ యూనివర్శిటీ(Ondokuz Mayıs University), ఇండియాని యూనివర్శిటీ ( Turkey and Indiana University)సైంటిస్టులు నిర్వహించిన పరిశోధకులు ఈ అరుదైన జీవుల్ని గుర్తించారు.
వీటి లాటిన్ పేరు తల్పా యూరోపియా(Talpa hakkariensis )గా పిలుస్తారు. తల్పా హక్కరియెన్సిస్ (Talpa davidiana tatvanensis)అండ్ తల్పా డేవిడియానా అనే జాతులు కూడా ఉంటాయి. ఇతర క్షీరదాలతో పోలిస్తే ఇవి తమ శరీరంలో ఎర్ర రక్త కణాలను పెద్ద సంఖ్యలో కలిగి ఉంటాయి. అందుకే 100 శాతం భూగర్భంలో జీవించగల శారీరక పరిస్థితిని కలిగి ఉంటాయని గుర్తించారు. మనిషి జీవించి ఉండాలంటే కనీసం 21 శాతం ఆక్సిజన్ లెవల్స్ అవసరం. కానీ తల్పా యూరోపియన్ లేదా మోల్ జంతువులు జీవించడానికి కేవలం 7 శాతం ఆక్సిజన్ లెవల్స్ ఉంటే సరిపోతుందట. ఇవి సాధారణంగా పశ్చిమ ఆసియా, ఐరోపాలో కనిపించే భూగర్భ, అకశేరుక-ఈటింగ్ మమ్మల్స్ (invertebrate eating mammals )యొక్క సుపరిచితమైన సమూహంలో భాగం.
కొత్త జీవ జాతుల అన్వేషణలో భాగంగా ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్ యూనివర్సిటీ(University of Plymouth), టర్కీలోని ఒండోకుజ్ మేయిస్ యూనివర్సిటీ (Ondokuz Mayıs University)అండ్ ఇండియానా యూనివర్సిటీ( Turkey and Indiana University)కి చెందిన సైంటిస్టులు టర్కీలో కనుగొన్న న్యూ ‘మోల్స్’ గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఇవి శీతాకాలంలో 6 అడుగుల మంచు పొరల లోతుల్లోను..అదే వేసవిలో అయితే 122 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతల కింద కూడా జీవించి ఉటాయని తెలిపారు.
Sacred Waist Thread For Men : మగవాళ్లకు మొలతాడుకు సంబంధమేంటీ..? భారతీయ సంప్రదాయం వెనుక సైన్స్
ప్రపంచవ్యాప్తంగా కేవలం 6,500 క్షీరద జాతులు మాత్రమే ఇప్పటి వరకు గుర్తించబడ్డాయని తెలిపారు. కానీ టర్కీ పర్వతాల్లో కనుగొన్న ‘మోల్’ మిగతా వాటికంటే భిన్నమైందని..ప్లైమౌత్ యూనివర్సిటీ ఆక్వాటిక్ బయాలజీ ప్రొఫెసర్ డేవిడ్ బిల్టన్ షా (David Bilton)పేర్కొన్నానే. ఇతర జాతుల ‘లివింగ్ మోల్స్’తో తల్పా యూరోపియాలను పోల్చడానికి అత్యాధునిక డీఎన్ఏ (DNA) టెక్నాలజీని ఉపయోగించిన సైంటిస్టులు టర్కిష్ జీవులు బయాలజికల్‌గా డిఫరెంట్ భౌతిక లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. దీనిని బట్టి జీవవైవిధ్య స్వభావాన్ని తక్కువ అంచనా వేయలేమని ప్రకృతిలో ఇంకా కనుగొనబడని జీవజాతులు కూడా ఉండవచ్చునని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.