Sink hole in China : చైనాలో బయటపడ్డ అతిపెద్ద సింక్ హోల్..దాంట్లో అందమైన అడవి

చైనాలో ఓ సింక్ హోల్ బయటపడింది. అదెలా ఉందంటే.. అందులో ఓ అందమైన అడవి కూడా పట్టేంత. దానిని చూస్తే.. మైండ్ బ్లో అయ్యేంత. చూసినకొద్దీ చూడాలనిపించేంత..630 అడుగుల లోతు..1,004 అడుగుల ఎత్తు..492 అడుగుల వెడల్పు గల ఓ పేద్ద సింక్ హోల్ డైమెన్షన్ అది. కొత్తగా బయటపడ్డ అతిపెద్ద సింక్ హోల్ డైమెన్షన్ ఇవి.

CHINA Sink hole  : అప్పుడప్పుడు.. ఈ మనుషులు చేసే దారుణాలు చూడలేక, తట్టుకోలేక.. భూమి కుంగిపోతూ ఉంటుంది. కానీ.. దానికో లిమిట్ ఉంటుంది. ఓ కారు పట్టేంతో.. లేకపోతే.. ఓ లారీ పడిపోయేంతో.. అలాగన్నమాట. కానీ.. చైనాలో ఓ సింక్ హోల్ బయటపడింది. అదెలా ఉందంటే.. అందులో ఓ అందమైన అడవి కూడా పట్టేంత. దానిని చూస్తే.. మైండ్ బ్లో అయ్యేంత. చూసినకొద్దీ చూడాలనిపించేంత..630 అడుగుల లోతు..1,004 అడుగుల ఎత్తు..492 అడుగుల వెడల్పు గల ఓ పేద్ద సింక్ హోల్ డైమెన్షన్ అది. కొత్తగా బయటపడ్డ అతిపెద్ద సింక్ హోల్ డైమెన్షన్ ఇవి. ఇది.. 630 అడుగుల లోతులో ఉంది. ఈ సింక్ హోల్ ప్రత్యేకత ఏమిటంటే, దీని లోపల.. అందమైన అడవి కూడా ఉంది. ఈ మధ్యే.. చైనాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు.. దీనిని కనుగొన్నారు. దీంతో.. చైనాలో సింక్ హోల్స్ సంఖ్య 30కి చేరింది.

Also read : Strange Tradition : ఆ ఊరిలో వింత సంప్రదాయం..ఒకరికొకరు తాళి కట్టుకునే వధూవరులు

చూస్తున్నారుగా.. ఎంత అందంగా ఉందో. భూమి కుంగిపోయి.. దాని లోపల.. ఎంత అందమైన అడవి పెరిగిందో. ఈ విజువల్.. చైనాలోనే కాదు.. వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. వండర్‌ఫుల్ సైట్ అంటూ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తల టీమ్‌కి.. నేచర్ లవర్స్ అంతా.. థ్యాంక్స్ చెబుతున్నారు. అప్పుడప్పుడు భూగర్భంలో జరిగే మార్పులతో.. భూమిపై కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. ఈ సింక్ హోల్ కూడా ఆ లిస్టులోకే వస్తుంది. నిజానికి.. భూమి కుంగిపోవడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ.. ఈ స్థాయిలో సింక్ హోల్స్ ఏర్పడటం.. వెరీ రేర్. పైగా.. అందులోనే.. ఓ అందమైన అడవి పెరగడమనేది.. అద్భుతమనే చెప్పాలి. అంతేకాదు.. ఈ అడవి.. సింక్ హోల్ అందాన్ని రెట్టింపు చేస్తోందని.. నెటిజన్లంతా.. ఇంటర్నెట్‌లో కామెంట్స్ చేస్తున్నారు.

చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఈ సింక్‌హోల్‌ను కనుగొన్నారు. లేయే కౌంటీలోని.. పింగ్ గ్రామ సమీపంలో ఇది ఉంది. ఈ సింక్ హోల్‌లో.. 131 అడుగుల ఎత్తుతో ఉన్న కొన్ని పురాతన చెట్లను కూడా సైంటిస్టులు కనుగొన్నారు. చెట్ల కొమ్మలు చాలా అందంగా.. ఎత్తులో కనువిందు చేస్తున్నాయ్.ఈ సింక్ హోల్ వెయ్యి అడుగులకు పైగా పొడవు, 492 అడుగుల వెడల్పుతో ఉందని.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్ట్ జియాలజీలో సీనియర్ ఇంజనీర్లు తెలిపారు. ఈ సింక్ హోల్ ఫ్లోర్‌లో.. దట్టమైన పొదలు కూడా ఏర్పడ్డాయి. అవి.. ఒక వ్యక్తి భుజానికి సరిపోయేంత ఎత్తులో ఉన్నాయి. అంతేకాదు.. ఈ గుహల్లో.. ఇప్పటివరకు సైన్స్‌కి దొరకని.. జాతులు కూడా ఉన్నాయనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు సైంటిస్టులు.

Also read : Kim Jong-un : ఉత్తరకొరియాలో మూడురోజుల్లో 8,20,000లకు పైగా కేసులు నమోదు..

ఈ సింక్ హోల్స్.. రెండు రకాలుగా ఏర్పడుతుంటాయ్. ఒకటి.. సహజంగా. మరొకటి.. మానవ కార్యకలాపాల వల్ల. సాధారణంగా.. నీటిపారుదల కారణంగా.. భూగర్భం కోతలు గురవుతుంది. భూమి పొరల్లోని సున్నపురాయి, డోలమైట్, జిప్సం లాంటి రాళ్లు కరిగిపోయి.. ఇవి ఏర్పడతాయి. భూగర్భ జల మట్టాల్లో.. మార్పులు-చేర్పుల వల్ల కూడా సింక్ హోల్స్ ఏర్పడుతుంటాయి.

ట్రెండింగ్ వార్తలు