Humans cook 780,000 years ago : 7.8 లక్షల ఏళ్ల క్రితమే వంట..ఆదిమానవులు వండిన ఆహారాన్ని తిన్నారని గుర్తించిన శాస్త్రవేత్తలు

 ‘ఆదిమ మానవులు జంతువులను వేటాడి పచ్చి మాంసం తినేవారని..వారi అప్పటికి వంట చేయటం గుర్తించలేదని పచ్చి మాంసాన్ని..పచ్చి కూరగాయలను..దుంపలను తిని కడుపు నింపుకొనేవారని ఇప్పటి వరకు అనుకునే మాట. కానీ అదంతా నిజం కాదని ఆదిమానవులు కూడా వంట చేసి తిన్నారని చేపలను వేటాడి వాటిని వండి తిన్నారని తాజాగా కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

  • Published on- November 21, 2022 / 03:47 PM IST

Scientists have discovered that early humans cooked fish 780,000 years ago

Humans cook 780,000 years ago : ‘ఆదిమ మానవులు జంతువులను వేటాడి పచ్చి మాంసం తినేవారని..వారi అప్పటికి వంట చేయటం గుర్తించలేదని పచ్చి మాంసాన్ని..పచ్చి కూరగాయలను..దుంపలను తిని కడుపు నింపుకొనేవారని ఇప్పటి వరకు అనుకునే మాట. కానీ అదంతా నిజం కాదని ఆదిమానవులు కూడా వంట చేసి తిన్నారని చేపలను వేటాడి వాటిని వండి తిన్నారని తాజాగా కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

మానవ జాతి పరిణామ క్రమంలోనే నిప్పు పుట్టించి వెలుగులు నింపుకుని ఆ తరువాత చాలా కాలానికి ఆ నిప్పుల మీద వండటం నేర్చుకున్నాడని ఇప్పటి వరకు అనుకునే మాట. కానీ మానవుడు (ఆదిమానవుడు) లక్షల ఏళ్ల క్రితమే వంట చేసుకుని తిన్నాడని తాగా గుర్తించారు శాస్త్రవేత్తలు. అనుకొన్న దాని కంటే 7.8 లక్షల ఏండ్ల కిందటే మనుషులకు వంట చేయడం తెలుసని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 10-20 లక్షల ఏండ్ల క్రితం ప్రారంభ జాతి మానవుల్లో పొడవాటి శరీరం, పెద్ద మెదడు ఉండేదని.. క్యాలరీలు అధికంగా ఉండే వండిన ఆహారం తినడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.

మట్టితో పొయ్యి తయారు చేసుకుని మంట పెట్టి దానిపై చేపలను వండి తినేవారని గుర్తించారు.ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లోని స్టెయిన్‌హార్డ్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ఇరిట్ జోహార్ మాట్లాడుతూ..ఆదిమానవలు వంట చేశారని కాలిపోయిన జంతువుల అవశేషాలను బట్టి 1.5 మిలియన్ సంవత్సరాల క్రితం మనుషులు మాంసాన్ని వండుకుని తిన్నారని తెలుస్తోంది అని తెలిపారు. దీనికి సంబంధించిన తొలి సాక్ష్యాలను పరిశోధనలు వెల్లడించారు.

ఇజ్రాయెల్ లోని ఉత్తర జోర్డాన్ నది లోయలోని గెషెర్ బెనోట్ యాకోవ్‌లో 780,000 సంవత్సరాల నాటి స్థావరాన్ని అధ్యయనం చేయగా ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపారు. ఆ ప్రాంతంలో లభ్యమైన రాతి పనిముట్ల ఆధారంగా వంట చేసినట్లుగా తెలుస్తోందన్నారు. ఒకప్పుడు పొయ్యిలు కాలిపోయిన ప్రాంతాల చుట్టూ చేపల దంతాల (ముళ్లు)ను పరిశోధకులు గమనించారు. అవి రెండు జాతుల చేపలకు చెందినవిగా గుర్తించారు. దాదాపు 10-20 లక్షల ఏళ్ల క్రితం ప్రారంభ జాతి మానవుల్లో పొడవాటి శరీరం, పెద్ద మెదడు ఉండేదని.. క్యాలరీలు అధికంగా ఉండే వండిన ఆహారం తినడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.