ఏడు నెలల పిల్లాడు ఓ పేద్ద సిటీకి మేయర్ గా ఎన్నికయ్యాడు. ఇది నిజంగా విచిత్రమే. ఏడు నెలల పిల్లాడంటే బోసినవ్వులు నవ్వుతూ..నేలపై పాకుతూ ఆడుకుంటుంటాడు. కానీ విలియం చార్లెస్ మెక్‌మిలియన్ అనే ఏడు నెలల పసివాడు మేయర్ గా ఎన్నిక అవ్వటమే కాదు ఆదివారం (డిసెంబర్ 16) ప్రమాణస్వీకారం కూడా చేశాడు. అమెరికా టెక్సాస్‌లోని వైట్‌హాల్ ప్రాంతానికి మేయర్ గా ఎన్నికయ్యాడు. ఈ బుడతడు చక్కగా బ్లాక్ సూట్ వేసుకుని మేయర్ గా ప్రమాణస్వీకారం చేయగానే అధికారులు, స్థానికులు చార్లీని చప్పట్లతో తమ హర్షాన్ని తెలిపారు.
పసివాడు.. మేయర్‌గా ఎన్నికవ్వడం ఏమిటీ మరీ విడ్డూరం అనుకుంటాం. మరి ఆ బుడ్డి మేయర్ స్టోరి ఏంటో చూద్దాం..వైట్‌హాల్ ప్రాంతానికి చెందిన విలియం చార్లెస్ ఏడు నెలల బిడ్డ గ్రిమ్స్ కౌంటీకి మేయర్‌గా ఎన్నికై చరిత్రలో సృష్టించాడు.
వైట్‌హాల్ వాలంటీర్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన బీబీక్యూ ఫండ్ రైజర్ ఆధ్వర్యంలో ఏటా గ్రిమ్స్ కౌంటీ మేయర్ పదవి కోసం వేలం పాట నిర్వహిస్తారు. ఇందులో బిడ్‌ను ఎవరు గెలుచుకుంటారో వారికి మేయర్ పదవి దక్కుతుంది. అలా ఎన్నికైనవారు సంవత్సరం పాటు మేయర్ గా ప్రజలకు సేవలందిస్తారు. ఈ క్రమంలో చార్లీ తల్లిదండ్రులు వేలంపాటలో పాల్గొన్నారు. మేయర్ పదవికి తన కొడుకు విలియం చార్లెస్ పేరును ప్రతిపాదించారు. ఈ బిడ్ లో విలియం చార్లెస్ గెలుచుకోవటంతో మేయర్అయ్యాడు.
చార్టీ ప్రమాణస్వీకారం సందర్భంగా తల్లి మాట్లాడుతూ..”మీరు డెమొక్రాట్, రిపబ్లికన్ లేదా ఇండిపెండెంట్ అయినా, చార్లీ నిన్ను ప్రేమిస్తాడు” అని అన్నారు.
వైట్‌హాల్ కమ్మునిటీ సెంటర్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 150 మంది అతిథులు పాల్గొన్నారు. క్యూట్ క్యూట్ నవ్వులతో మేయర్ వస్త్రాల్లో మెరిసిన చార్లీని చూసి అంతా మురిసిపోయారు. అంతా ఇప్పుడు ఆ పసివాడిని మేయర్ చార్లీ అని పిలుస్తున్నారు. మేయర్ పోడియంలో ఉండేందుకు కేవలం చార్లీ తల్లిదండ్రులు చాద్, నాన్సీ మెక్ మిల్లన్‌కు మాత్రమే ఉంది. మేయర్ తరఫున వారే పాలనా బాధ్యతలు నిర్వహిస్తారు.