Food Delivery Man: కస్టమర్‌కు డెలివరీ చేయాల్సిన ఫుడ్‌ను అప్పుడప్పుడూ డెలివరీ బాయ్స్ తిన్న సంఘటనలు వెలుగు చూస్తుంటాయి. తాజాగా బ్రిటన్‌లో ఒక కస్టమర్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ కస్టమర్ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు.
India vs South Africa: ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం.. మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్
ట్విట్టర్ ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. బ్రిటన్‌లో డెలివరూ అనే ఒక డెలివరీ సర్వీస్ యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. తాజాగా లియామ్ బగ్నాల్ అనే ఒక కస్టమర్ స్థానిక రెస్టారెంట్ నుంచి ఈ యాప్ సర్వీస్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే, అతడికి ఆ ఫుడ్ డెలివరీ కాలేదు. కానీ, డెలివరీ బాయ్ నుంచి మెసేజ్ వచ్చింది. అతడు ఆర్డర్ చేసిన ఫుడ్ తిన్నానని, బాగుందని మెసేజ్ చేశాడు. అంతేకాదు.. అవసరమైతే డెలివరూ కంపెనీకి ఫిర్యాదు కూడా చేసుకోమన్నాడు.
Cable Bridge: గుజరాత్లో కూలిన కేబుల్ బ్రిడ్జి.. పలువురికి గాయాలు
దీంతో షాక్ తిన్న కస్టమర్.. ‘నువ్వో ప్రమాదకరమైన వాడివి’ అని మెసేజ్ చేస్తే ‘డోంట్ కేర్’ అని రిప్లై ఇచ్చాడు. అయితే, ఆ తర్వాత ఆ డెలివరీ బాయ్… కస్టమర్‌కు సారీ చెప్పాడు. దీనికి సంబంధించిన చాట్‌ను కస్టమర్ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Deliveroo driver has gone rogue this morning pic.twitter.com/sFNMUtNRrk
— Bags (@BodyBagnall) October 28, 2022