Cable Bridge: గుజరాత్‪లో కూలిన కేబుల్ బ్రిడ్జి.. పలువురికి గాయాలు

గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో పలువురు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Cable Bridge: గుజరాత్‪లో కూలిన కేబుల్ బ్రిడ్జి.. పలువురికి గాయాలు

Cable Bridge: గుజరాత్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంతో పలువురు సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ఘటన గుజరాత్, మోర్బి ప్రాంతంలోని మచ్చు నదిపై ఆదివారం సాయంత్రం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం పలువురు సందర్శకులు సరదాగా తిరుగుతుండగా, ఉన్నట్లుండి బ్రిడ్జి కూలిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్న చాలా మంది నదిలో పడిపోయారు.

Maharashtra: లిజ్ ట్రస్‌ను ఆదర్శంగా తీసుకుని ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలి.. ‘మహా’ ప్రతిపక్ష నేతల డిమాండ్

వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. బాధితుల్ని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భారీ ఎత్తున అంబులెన్సుల్ని ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి కొంతకాలంపాటు మూసి వేసి ఉంది. మరమ్మతుల తర్వాత ఐదు రోజుల క్రితమే బ్రిడ్జిని అధికారులు తిరిగి ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణంలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో బ్రిడ్జిపై దాదాపు 400 మంది సందర్శకులు ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.