India vs South Africa: ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం.. మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్

దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన టీ20 మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. భారత వరుస విజయాలకు ఈ మ్యాచ్ బ్రేక్ వేసింది.

India vs South Africa: ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం.. మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్

Updated On : October 30, 2022 / 8:43 PM IST

India vs South Africa: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా, 5 వికెట్ల తేడాతో ఇండియాపై విజయం సాధించింది.

Maharashtra: లిజ్ ట్రస్‌ను ఆదర్శంగా తీసుకుని ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలి.. ‘మహా’ ప్రతిపక్ష నేతల డిమాండ్

గెలుపు కోసం చివరి వరకు పోరాడిన రోహిత్ సేన ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 133 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో సూర్య కుమార్ యాదవ్ మినహా ఎవరూ రాణించలేదు. సూర్య కుమార్ యాదవ్ 40 బంతుల్లో 68 పరుగులు చేసి, జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 15 (14), కేఎల్ రాహుల్ 9 (14), విరాట్ కోహ్లీ 12 (11) పరుగులకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరూ సత్తాచాటలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో లుంగి ఎంగిడి 4 వికెట్లు తీయగా, పర్నెల్ 3 వికెట్లు తీశాడు. తర్వాత 134 లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

Kangana Ranaut: కంగనా బీజేపీలోకి రావొచ్చు.. కానీ షరతులివే: జేపీ నద్దా

అయితే, మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్.. ఇద్దరూ అర్ధ శతకాలు సాధించి దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించారు. నాలుగు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా, 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజేతగా నిలిచింది. మొత్తం 137 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ షమి, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. తాజా విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు అగ్ర స్థానంలో ఉన్న భారత జట్టు రెండో స్థానానికి పడిపోయింది.