Israel : నన్ను చంపద్దు ప్లీజ్.. అంటూ హమాస్ ముష్కరుల్ని వేడుకుంటున్న ఇజ్రాయిల్ మహిళ వీడియో వైరల్

ఇజ్రాయెల్‌లో హమాస్ గ్రూప్ ఓ మహిళను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. చూసిన వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆ మహిళ ఎవరు?

Israel

Israel : ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డ హమాస్ మిలిటెంట్లు కనిపించిన జనాల్ని చంపి, కొందరిని బంధించి గాజాకు తరలించారు. శాంతి ఉత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన ఓ మహిళను ముష్కరులు కిడ్నాప్ చేసి మోటార్ బైక్‌పై తరలిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. తనను చంపొద్దని ఆ మహిళ వేడుకుంటున్న వీడియో చూసేవారిని ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనలో ఆమె బాయ్ ఫ్రెండ్‌ను సైతం ముష్కరులు ఈడ్చుకెళ్లారు.

Israel : ఇజ్రాయెల్ స్డెరోట్‌ పట్టణ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. హమాస్ ఉగ్రవాదుల ఆకస్మిక దాడితో ఇజ్రాయెల్ దేశంలోని స్టెరోట్ సిటీ రక్తసిక్తమైంది. ఇజ్రాయెల్ గ్రామాల్లోకి ప్రవేశించిన హమాస్ ముష్కరులు కొందరిని చంపి.. మరికొందరినీ కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. అలా సౌత్ ఇజ్రాయెల్‌లో శాంతి ఉత్సవానికి వెళ్లిన 25 సంవత్సరాల మహిళను హమాస్ గ్యాంగ్  కిడ్నాప్ చేసి బైక్‌పై తీసుకెళ్తున్నషాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

అర్గమణి అనే మహిళ తన బాయ్ ఫ్రెండ్ అవినాథన్‌తో సౌత్ ఇజ్రాయెల్‌లో శాంతి ఉత్సవంలో పాల్గొనేందుకు వెళ్లింది. అక్కడ హమాస్ ముష్కరులు అర్గమణిని కిడ్నాప్ చేసారు. దాంతో ఆమె ‘నన్ను చంపవద్దు.. వద్దు..’ అని ఆందోళనతో అరుస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఆమె బాయ్ ఫ్రెండ్ అవినాథన్‌ను కూడా హమాస్ గ్రూప్ అక్కడి నుంచి గాజాకు తరలించినట్లు తెలుస్తోంది.

Israel – Gaza Attacks : దాడులతో దద్దరిల్లుతోన్న ఇజ్రాయెల్, గాజా.. 400కి పైగా పౌరులు మృతి.. ఇజ్రాయెల్ కు భారత్, అమెరికా మద్దతు

@HenMazzig ట్విట్టర్ ఖాతాలో అర్గమణి కిడ్నాప్‌కి గురయిన ఇన్సిడెంట్‌ను షేర్ చేస్తూ ఆమెను విడిచిపెట్టాల్సిందిగా ఫ్యామిలీ మెంబర్స్ వేడుకుంటూ పోస్ట్ చేసారు. అటు అవినాథన్ సోదరుడు మోషే ఓర్ తన సోదరుడు తప్పిపోయినట్లు నివేదించాడు. అర్గమణి ఇటీవలే శ్రీలంక పర్యటన నుంచి వచ్చిందని తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానమని వారు షాక్ లో ఉన్నారని ఆమె స్నేహితురాలు అమీర్ మోడీ వెల్లడించారు.