పెళ్లి చేసుకున్నాడు..కానీ అంతలోనే షాక్

  • Publish Date - January 16, 2020 / 01:50 AM IST

కొత్తగా పెళ్లి చేసుకున్నాడు..తన జీవితంలో భాగస్వామి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశాడు..భవిష్యత్‌పై కలలు కన్నాడు..కానీ..అంతలోనే షాక్..తాను కన్న కలలు..పటాపంచలు అయిపోయాయి. తాను పెళ్లి చేసుకుంది..స్త్రీని కాదని తెలుసుకున్న అతను షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఈ ఘటన ఉగాండలో చోటు చేసుకుంది. 

ఉగాండ ఇమాం మహ్మద్ ముతుంబా 15 రోజుల కిందట వివాహ ఒప్పందం చేసుకున్నాడు.ఓ మసీదులో బురఖా ధరించి ఉన్న స్త్రీని చూసి తాను ఆకర్షితులయ్యాయని, ఈ సమయంలో ప్రేమను ప్రపోజ్ చేయగా..అంగీకరించిందని ఇమాం వెల్లడించారు. తన తల్లిదండ్రులకు వధువు కట్నం చెల్లించే వరకు శారీరకంగా కలవొద్దని కండీషన్ పెట్టినట్లు వాపోయాడు.

ఇదిలా ఉంటే…ఇమాం పక్కనే ఉన్న నివాసంలో వస్తువులు చోరీకి గురయ్యాయని గుర్తించారు. తమ ఇంట్లో నుంచి దొంగిలించింది..ఇమాం భార్య అని తేల్చారు. పీఎస్‌లో కంప్లయింట్ చేయగా..ఇమాం భార్యను పిలిపించి విచారణ చేపట్టారు.

మహిళా పోలీసు అధికారి..అనుమానితురాలిని పరిశీలించగా..అషలు విషయం బయటపడింది. స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడని తేలింది. విషయం తెలిసిన ఇమాం షాక్‌కు గురయ్యాడు. ఇమాంను డబ్బు కోసమే..స్త్రీలా నటించి పెళ్లి చేసుకున్నానని నిందితుడు వెల్లడించాడు. నిందితుడిపై చీటింగ్..చోరీ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. 

Read More : GSAT 30 ప్రయోగానికి ISRO రెడీ