Jerusalem ఒక్కసారిగా కుంగిన భూమి..గోతిలో పడిపోయిన కార్లు, వీడియో వైరల్

నిలుచున్న చోట ఒక్కసారిగా భూమి కుంగిపోతే... పెద్ద గొయ్యిలో పడిపోతే... మనలో చాలా మందికి ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయి. కొంతమందికి నిద్రలో కలలు కూడా వస్తాయి. వెంటనే ఉలిక్కి పడి లేస్తుంటారు కూడా. అలాంటి ఘటనే ఒకటి జెరూసలెంలోని ఓ ఆసుపత్రి బయట జరిగింది.

Jerusalem ఒక్కసారిగా కుంగిన భూమి..గోతిలో పడిపోయిన కార్లు, వీడియో వైరల్

Jerusalem

Updated On : June 9, 2021 / 5:11 PM IST

Jerusalem : నిలుచున్న చోట ఒక్కసారిగా భూమి కుంగిపోతే… పెద్ద గొయ్యిలో పడిపోతే… మనలో చాలా మందికి ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయి. కొంతమందికి నిద్రలో కలలు కూడా వస్తాయి. వెంటనే ఉలిక్కి పడి లేస్తుంటారు కూడా. అలాంటి ఘటనే ఒకటి జెరూసలెంలోని ఓ ఆసుపత్రి బయట జరిగింది.

జెరూసలేంలోని జెడెక్‌ మెడికల్‌ ఆసుపత్రి బయట పార్కింగ్ స్థలం ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడ ఉన్న కార్లు అందులో కూరుకుపోయాయి. దాదాపు 50 కార్లు ఉన్న పార్కింగ్‌ స్థలంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. దానితో అక్కడ ఉన్న నాలుగు కార్లు అందులో కూరుకుపోయాయి. ఒక సొరంగం నిర్మిస్తున్న హైవే సమీపంలో సింక్ హోల్ కనిపించిందని అధికారులు చెబుతున్నారు.

సొరంగం కారణంగా గొయ్యి ఏర్పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సొరంగం నిర్మిస్తున్న మార్గంలో పార్కింగ్‌ ఏర్పాటు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీస హెచ్చరికలు కూడా చేయలేదంటున్నారు.

Read More : Maharashtra News: కడుపులో కత్తితోనే పోలీస్‌స్టేషన్‌కు పరుగు