Mexico : మెక్సికో బార్‌లో కాల్పులు…ఆరుగురి మృతి

మెక్సికోలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బార్ కాల్పుల్లో ఆరుగురు మరణించారు. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలోని బార్‌లో కాల్పులు జరిపిన దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించారు....

Mexico : మెక్సికో బార్‌లో కాల్పులు…ఆరుగురి మృతి

Mexico Shooting

Updated On : September 17, 2023 / 10:05 AM IST

Mexico : మెక్సికోలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బార్ కాల్పుల్లో ఆరుగురు మరణించారు. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం జాలిస్కోలోని బార్‌లో కాల్పులు జరిపిన దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. మారావిల్లాస్ పరిసరాల్లోని బార్‌లో పలువురు వ్యక్తులు కాల్పులు జరిపారు. మెక్సికోలోని అతిపెద్ద క్రిమినల్ గ్రూపుల్లో ఒకటైన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్‌ కాల్పులకు తెగబడింది. (Six Killed In Bar Shooting)

Heart Attack : జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ గుండెపోటుతో యువకుడి మృతి

జాలిస్కో రాజధాని గ్వాడలజారాకు ఉత్తరాన ఉన్న టియోకల్టిచే ఈ నెల ప్రారంభంలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. (Independence Day Celebrations In Mexico) మెక్సికన్ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం అర్థరాత్రి టియోకల్టిచే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుందని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.