Plane Crash : కాలిఫోర్నియాలో కూలిన విమానం..ఆరుగురి మృతి
కాలిఫోర్నియాలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. కాలిఫోర్నియాలోని మురియెటాలో తెల్లవారుజామున కూలిన సెస్నా బిజినెస్ జెట్ విమానంలో ఆరుగురు మృతి చెందారు.....

Plane Crash In California
Plane Crash In California : కాలిఫోర్నియాలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. కాలిఫోర్నియాలోని మురియెటాలో తెల్లవారుజామున కూలిన సెస్నా బిజినెస్ జెట్ విమానంలో ఆరుగురు మృతి చెందారు. (Six Killed) ఫ్రెంచ్ వ్యాలీ విమానాశ్రయానికి సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. (Six Killed In Plane Crash) రివర్‌సైడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం మాట్లాడుతూ విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు సైట్‌లో చనిపోయారని తెలిపారు.
Honey Trapped : బీఎస్ఎఫ్ ఉద్యోగిపై పాక్ మహిళా ఏజెంట్ వలపు వల
వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం శాన్ డియాగోకు ఉత్తరాన 65 మైళ్ల దూరంలో కూలిపోయింది. పొలంలో విమానం కూలిపోవడంతో ఎకరంలో చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఈ విమానం ఎలా కూలిందనే విషయం ఇంకా తెలియలేదు. విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల వివరాలు అందాల్సి ఉంది.