జార్జియాలో విమానం కూలి ఐదుగురు మృతి.. అంత్యక్రియలకు వెళ్తూ అనంతలోకాలకు 

  • Published By: nagamani ,Published On : June 6, 2020 / 06:15 AM IST
జార్జియాలో విమానం కూలి ఐదుగురు మృతి.. అంత్యక్రియలకు వెళ్తూ అనంతలోకాలకు 

Updated On : June 6, 2020 / 6:15 AM IST

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో విమాన ప్రమాదం సంభవించింది. విమాన ప్రమాదంలో మొత్తం ఐదుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

ఫ్లోరిడాకు చెందిన కుటుంబం ఇండియానాలో జరిగే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చిన్న విమానంలో వెళ్తుండగా విమానం కూలి చనిపోయారు. రెండు ఇంజిన్లు గల టర్బో విమానం ఫ్లోరిడాలోని విల్‌స్టన్‌ ఎయిర్ పోర్ట్ నుంచి శుక్రవారం మధ్యాహ్నాం 3.15 గంటలకు  బయల్దేరింది. జార్జియాలోని ఈటన్టన్‌కు ఈశాన్యంగా ఆరు మైళ్ల దూరంలో టాన్వార్డ్‌ రోడ్‌ సమీపంలోని దట్టమైన అడవుల్లో కూలిపోయింది. అకస్మాత్తుగా వచ్చిన తుఫానే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో మరణించిన వారు షాన్ చార్లెస్ లామోంట్ (41) అనతి భార్య జోడిరేలామోంట్ (43) వీరి పిల్లలు ఆరేళ్ల జేస్ నాలుగేళ్ల ఆలిస్ కూడా ఉన్నారు. మరో వ్యక్తి ఫ్లోరిడాకు చెందినవారిగా తెలుస్తోంది. వీరింతా ఇడియానాలో జరిగే వారి బంధువుల అంత్యక్రియలకు వెళుతూండగా ఈ ప్రమాదానికి గురైయ్యారు. 

Read: అల్-ఖైదా చీఫ్‌ని‌ మట్టుబెట్టిన బలగాలు