South Africa : ప్రకృతి కన్నెర్ర.. వరదల బీభత్సానికి 400 మంది మృతి ?

వరదల కారణంగా ఇప్పటి వరకు 400 మంది దాక ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు...వేలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు.

South

South Africa Floods : ప్రకృతి కన్నెర్ర చేసింది. వరదల భీభత్సానికి ప్రజలు అతలాకుతలమౌతున్నారు. ఎక్కడ చూసినా నేల కూలిన ఇళ్లు, చెట్లు కనిపిస్తున్నాయి. అత్యంత ఘోరమైన విపత్తుగా పరిగణిస్తున్నారు. ఇంతకు ముందు ఇలాంటి వరదలు రాలేదని వెల్లడిస్తున్నారు. రోడ్లు పూర్తిగా కొట్టుకపోవడంతో ఎటూ వెళ్లాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కరెంటు స్తంభాలు నేలకూలడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 400 మంది దాక ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు.

Read More : Russia Eyes On Kyiv : అన్నంత పని చేసిన రష్యా.. మళ్లీ అక్కడ క్షిపణుల వర్షం

వేలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు. దక్షిణాఫ్రికా దేశంలో వరదలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 3.5 మిలియన్ల జనాభా ఉన్న నగరంలో రెస్క్యూటీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇళ్లల్లో ఉన్న మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, సైన్యం, వాలంటీర్లు రంగంలోకి దిగి రెస్క్యూ పనులు చేపడుతున్నారు.

Read More : Ukraine Soldiers Surrender : లొంగిపోండి.. ప్రాణాలతో వదిలేస్తాం – యుక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం

తీర నగరమైన డర్బన్ లోని కొన్ని ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లన్నీ పాడైపోయాయి. నీటి ప్రవాహానికి ఆసుపత్రుల భవంతులు నేలకూలిపోయాయి. ఇళ్లల్లో ఉన్న వారు వరదలకు కొట్టుకపోయారు. ఈ వీకెండ్ లో ఈస్టర్ హాలిడే వేడుకలతో ప్రజలు ఆహ్లాదకరంగా ఉండేవారు. మృతుల సంఖ్య శనివారం 398కి చేరుకోగా.. 27 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం అత్యవసర సహాయ నిధి కింద బిలియన్ ర్యాండ్ ప్రకటించింది. వరద బాధితులకు సంఘీభావంగా జరగాల్సిన క్యూరీ కప్ రగ్బీ మ్యాచ్ రద్దు చేశారు. కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలుస్తోంది.