South Korea serial killer : నేరాలు..ఘోరాలు చేసిన నేరగాళ్లు పోలీసులకు పట్టుబడి కోర్టులో హాజరు పరిచాక..ఈనేరాలు మేం చేయలేదు…వీటితో మాకేం సంబంధం లేదు…మమ్మల్ని ఈకేసులో ఇరికించారని చెబుతుంటారు.కానీ ఓ నేరస్థుడు మాత్రం నేను ఎన్నో హత్యలు చేశాను..నేరం కూడా అంగీకరిస్తున్నాను..కానీ నాకు శిక్ష వేయరేంటీ? అని మొత్తుకుంటున్నాడు దక్షిణ కొరియాకు చెందిన లీ చున్ జే అనే నేరస్తుడు.
విచిత్రమైన ఈ నేరస్తుడు వివరాల్లోకి వెళితే..దక్షిణ కొరియాకు చెందిన లీ చున్ జే అనే నేరస్తుడు 14 మంది మహిళలు, యువతులను అత్యంత ఘోరంగా హత్య చేశాడు. ఇంకా ఎన్నో దారుణాలు చేశాడు. కానీ అతడు చేసిన హత్యలను పోలీసులు గుర్తించకపోవడం విశేషం.
30 ఏళ్ల క్రితం హత్యలు చేసిన లీ చున్ జే మాట్లాడుతూ..‘‘ఇన్నాళ్లు నేను ఇన్ని హత్యలు చేసినా నన్ను పోలీసులు పట్టుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని పోలీసులు ఇంత చేతకానివాళ్లా..అంటూ సాక్షాత్తూ న్యాయస్థానంలోనే జడ్జిగారి ముందే వ్యాఖ్యానించాడు. తాను చేసిన నేరాలను శాశ్వతంగా దాచిపెట్టాలని అనుకోలేదని అందుకే 30 ఏళ్ల క్రితం నేను చేసిన హత్యల గురించి చెబుతున్నానని 57ఏళ్ల లీ సువాన్ నగరంలోని కోర్టుకు తెలిపాడు. తాను మొత్తం 14మందిని హత్య చేసినట్టు గతేడాది మొదటిసారి అతడు చెప్పాడు.
కాగా..దక్షిణ కొరియా చట్టాలు అనుమానితులు, నేరస్థుల ప్రైవసీ హక్కుకు రక్షణ కల్పిస్తాయి. అందువల్ల నేరస్థుడి పూర్తి పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినందుకు నిందితుడికి గతంలో జీవితకాల శిక్ష పడింది. కానీ 20 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తరువాత అతను 2008లో విడుదల చేశారు.
1986 నుంచి 1991 మధ్య హ్వాసెంగ్ ప్రాంతంలో అతను 10 హత్యలు చేశాడు. ఈ వరుస హత్యలను స్థానికులు ‘‘హ్వాసెంగ్ మర్డర్స్’’ అని పిలుస్తారు. వీటితో కలిపి మొత్తం లీ 14మందిని హత్య చేసానని చెప్పాడు. కానీ ఈ హత్యలకు సంబంధించిన కేసులను పోలీసులు ఇంకా పరిష్కరించలేదు. ఈ సీరియల్ కిల్లింగ్స్‌పై 2003లో “Memories of Murder” పేరుతో ఒక సినిమా కూడా వచ్చిందంటే ఆ హత్యలు ఎంత సంచలనం సృష్టించాయో అర్థం చేసుకోవచ్చు. “Parasite” సినిమాను చిత్రీకరించిన బాంగ్ జూన్ హో ఈ సినిమాను తెరకెక్కించాడు.
2019లో లీ డీఎన్‌ఏ ఆధారాల సహాయంతో పోలీసులు లీ చేసిన కొన్ని హత్యలపై దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. ఇప్పటికీ అతడు చేసిన నేరాలపై విచారణ కొనసాగుతోంది. హత్యల గురించి పోలీసులు తనను ప్రశ్నించారని లీ గత సోమవారం (నవంబర్ 2,2020)తెలిపాడు. తన చేతుల్లో హత్యకు గురైన ఓ క వ్యక్తి వాచ్ కూడా ఇప్పటికీ నా దగ్గరే ఉందని లీ చెప్పడం విశేషం. కానీ పోలీసులు మాత్రం తన ఐడెంటిఫికేషన్ గురించి ఆరా తీసి..ఆ తర్వాత తనను వదిలేసారని లీ చెబుతున్నాడు. ఇన్ని నేరాలు చేసినా ఇప్పటి వరకూ నాకు శిక్ష వేయరేంటీ? అని ప్రశ్నిస్తున్నాడు లీ.
తాను నేరాలు చేశానని అవి ఎన్నో కూడా చెప్పినా సరే..పోలీసులు ఇంకా తాను చేసిన నేరాల్ని వాటికి సంబంధించి ఆధారాలను నిరూపించలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని లీ ఇటీవల ఓ ప్రముఖ వార్తా సంస్థకు తెలిపాడు.నేను చేసిన హత్యల గురించి దాచాలను నేను అనుకోవటంలేదేని స్పష్టంచేశాడు లీ. అందువల్ల సులభంగా పోలీసులు నన్ను పట్టుకుంటారని నేను అనుకున్నాను. కానీ పోలీసులు మాత్రం ఇప్పటివరకూ నా నేరాల ఆధారాలను సేకరించలేకపోతున్నారని అన్నాడు.
ఇక్కడ వందలాది పోలీసు బలగాలు ఉన్నాయి. కానీ వారు ఏంచేస్తున్నారో తెలీదు. పోలీసులు నన్ను డిటెక్టివ్ ల దగ్గరకు తీసుకెళ్లారు. కానీ వారు నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించే ప్రతీసారి అడిగేవారనీ..తెలిపారు. తాను చేసిన హత్యల్లో 13 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తున్నప్పుడు కూడా నేను ఎటువంటి భావోద్వేగాలకు గురికాలేదని లీ మీడియాకు చెప్పాడు.
తాను చేసిన హత్యలపై అనుమానంతో ఒక దివ్యాంగుడిని పోలీసులు అరెస్టు చేశారని ఎవరో చెబుతుంటే నేను విన్నానని లీ చెప్పాడు. కానీ తాను చేసిన హత్యల్లో దేనికి సంబంధించి అతడిని అరెస్టు చేశారో తెలియదన్నాడు. కానీ ఓ నేరస్థుడు నేను ఇన్ని హత్యలు చేశాను మొర్రో..నాకు శిక్ష వేయండి అని మొత్తు కుంటున్నా శిక్ష వేయకపోవటం చాలా చిత్రంగా ఉంది. ఇక ఇప్పటికైనా లీ హత్యలు చేసినట్టు పోలీసులు కోర్టులో నిరూపిస్తారో లేదో చూడాలి.