మాయా బజార్‌లా ఫుట్‌బాల్.. fake crowdతో లీగ్ మ్యాచ్‌లు

లాక్‌డౌన్ విధించారు. జరగాల్సిన లీగ్ మ్యాచ్‌లు, టోర్నమెంట్‌లు అన్నీ ఆగిపోయాయి. స్టేడియంలో నుంచి కాదు కదా.. కనీసం టీవీ స్క్రీన్లపైనా మ్యాచ్ లు చూడలేని పరిస్థితి. కరోనాతో కాపురం చేసేద్దామని లాక్ డౌన్ రూల్స్ సడలించేశారు. ఈ క్రమంలో ప్రపంచమంతా కొత్తదారులు వెతుక్కొని రెడీ అవుతోంది. అంతర్జాతీయంగా అత్యధిక మంది అభిమానులను సంపాదించుకున్న ఫుట్‌బాల్ ఓ కొత్త దారి వెదుక్కుంది.
నిత్యం అభిమానుల కేరింతలతో సాగే మ్యాచ్ లను స్టేడియంలోనే నిర్వహించడానికి డిఫరెంట్ అప్రోచ్ అవుతున్నారు. స్టేడియం ఫుల్ అవలేదు. అభిమానుల్లేరు అనే ఆలోచన లేకుండా నార్వే బ్రాడ్ కాస్టింగ్ టెక్ కంపీ విజువల్స్ ఏర్పాటు చేసింది. అది చూడటానికి లైవ్ ఆడియెన్స్ ఉన్నట్లు భ్రమ కలిగేలా చేస్తుంది.
‘ప్రీమియర్ లీగ్ కోసం NBA, లా లీగా డిఫరెంట్ గా కష్టపడుతున్నాం. వారి స్టైల్ ను మేం గౌరవిస్తున్నాం’ అని లా లీగా ఆడియో విజువల్ డైరక్టర్ మెల్సియో సోలెర్ అంటున్నారు. టెలివైజ్‌డ్ ఎంటర్ టైన్మెంట్ అందించాలనుకుంటున్నాం. స్టేడియంలన్నీ ఫుల్ జోష్ తో నిండినట్లుగా కనిపించాలని ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు.
ఈ ఆడియో వింటుంటే నిజంగా అభిమానులు స్టేడియానికి వచ్చినట్లుగానే ఉందంటున్నారు ప్లేయర్స్. నిజంగా లేకపోయినా దగ్గరి పోలికలు అయితే కనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ నాయీస్, శబ్దం పెంచడం తగ్గించడం కాస్త ఎగ్జైట్ మెంట్ ను ఇస్తుంది. గోల్ వేయడంతోనే వారి కేకలు మా చెవిన పడి మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయని లా లీగా ప్లేయర్ల అంటున్నారు.