Russia Ukraine War : ఊహించిందే జరుగుతోంది. రావొద్దు అనుకున్న అపాయమే రాబోతోంది. అణు యుద్ధం ఖాయం అనిపిస్తోంది. వెయ్యి రోజుల యుద్ధంలో రష్యా చర్యతో యుక్రెయిన్ మొదటిసారి ఉలిక్కి పడింది. ఈ వార్ ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా మొదటిసారి ప్రయోగించింది. ఈ మిస్సైల్ అంత ప్రమాదమా? అసలు యుక్రెయిన్ ఎందుకు భయపడుతోంది? తాడో పేడో తేల్చుకునేందుకు ఇక రష్యా సిద్ధమైనట్లేనా?
డెన్మార్క్, ఫిన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్, నార్వే, స్వీడన్.. వీటన్నింటిని కలిపి నార్తిటిక్ దేశాలని పేరు. పశ్చిమ ఐరోపాలో ఉత్తరాన ఆర్కిటిక్ వరకు ఈ దేశాలు విస్తరించి ఉంటాయి. అసలు యుద్ధం అంటే ఏంటో కూడా తెలియని ప్రశాంతతకు కేరాఫ్ లాంటి దేశాలివి. అలాంటిది రెండున్నరేళ్ల కిందట వీరికి భయం పట్టుకుంది. శతాబ్దాలగా ఏ సైనిక కూటమిలోనూ లేని ఆ దేశాలు.. ఇప్పుడు రష్యా-యుక్రెయిన్ యుద్ధ భయంతో నాటోలో చేరాయి. అదే పాపమైంది. ఇప్పుడు మరింత భయంతో వణికిపోతున్నాయి. యుద్ధం ముదిరితే, ప్రపంచ యుద్ధంగా మారితే, ఎలా ఉండాలి, ఏం చేయాలో జనాలకు సూచిస్తున్నాయి ఈ దేశాలు.
Also Read : అదానీపై అమెరికాలో లంచం కేసు.. అసలు ఎవరికి లంచం ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు?
ప్రపంచంలోనే సంతోషకర దేశాల్లో ఫిన్ ల్యాండ్, స్వీడన్ టాప్ లో ఉంటాయి. రష్యాతో యూరప్ లోనే ఫిన్లాండ్ కు అత్యంత సుదీర్ఘ సరిహద్దు ఉంది. స్వీడన్ కు, రష్యాకు మధ్య 15 కిలోమీటర్ల సరిహద్దే ఉన్నా.. పాలిటిక్స్ సముద్రం కారణంతో అత్యంత కీలకం. యుక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచి నార్త్ టిక్ దేశాల టెన్షన్ అంతా ఇంతా కాదు.
పూర్తి వివరాలు..
Also Read : కేసీఆర్ త్రిముఖ వ్యూహం ఫలించిందా? ఇక వలసలు ఆగినట్లేనా?