ఏడాదికి 10 మందిని గర్భవతులను చేయాలి : 2,500ల మంది పిల్లలకు తండ్రి కావాలని అతని టార్గెట్

sperm donor with 150 children worldwide : ప్రపంచంలోనే కనీ వినీ ఎరుగని టార్గెట్ అతనిది. వింటేముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ఎవరైనా చదువులోను..ఆటల్లోను లేదా ఏదైనా కనిపెట్టాలని వ్యాపారంలో ఉన్నతస్థాయికి చేరాలని తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంటారు. కానీ సంవత్సరానికి కనీసం 10మంది మహిళలను గర్భవతులను చేయాలని తన జీవితంలో 2వేల 500లమంది పిల్లలకు తండ్రి కావాలని ఎవరైనా లక్ష్యంగా పెట్టుకున్నోడో వ్యక్తి.
ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? ఇదేం టార్గెట్ రా బాబూ అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఎక్కడా విననీ..కనీసం ఊహించలేనిది కదూ.. అతని పేరు ‘జోయ్’. వయస్సు 45. మరి జోయ్ ఎందుకలా లక్ష్యం పెట్టుకున్నాడో తెలుసుకుందాం..
అమెరికాలోని వెర్మాంట్‌కు చెందిన జోయ్ ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన వాడిగా రికార్డులకెక్కిన ప్రఖ్యాత వీర్యదాత జోయ్ లక్ష్యం. కరోనాతో వచ్చిన లాక్ డౌన్ తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు..వ్యాపారాలు మూత పడ్డాయి. కానీ లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా జోయ్ ‘స్మెర్మ్ దానం’చేయటం ఆపలేదు. అవసరమైనవారికి వీర్యం అందిస్తూ..చాలా సందర్భాల్లో శారీరకంగాను వీర్యదానం చేస్తున్నాడు అమెరికాలోని వెర్మాంట్‌కు చెందిన 49 ఏళ్ల ‘స్పెర్మ్ డోనర్’గా పేరొందిన జోయ్.
ఇప్పటి వరకూ జోయ్ వందమందికిపైగా మహిళలకు వీర్యదానం చేసి 150 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. లాక్‌డౌన్‌లో కూడా ఆరుగురు మహిళల దానం చేశాడు. ఈ 150మందిలో కొన్ని కృత్రిమ గర్భధారణతోను మరికొన్ని శారీరకంగా ఈ స్పెర్మ్ దానం చేశాడు. 2020లో కనీసం 10 మందిని గర్భవతులను చెయ్యాలన్నది తన టార్గెట్ అంటున్నాడు జోయ్. ఇప్పటి వరకు తనకు పుట్టిన 150 మందిలో సగం మంది ఫిజికల్ రిలేషన్ ద్వారా పుట్టిన పిల్లలేనని తెలిపారు. పైగా స్పెర్మ్ దానం డబ్బుల కోసం కాదంటున్నాడు.
పైగా తనకు స్పెర్మ్ దానం కోసం ఫోన్ చేస్తే ఎక్కడికైనా వెళతానని ప్రయాణ ఖర్చులకు వీర్యగ్రహీతలే డబ్బులిస్తుంటారని..లాక్‌డౌన్ సమయంలో ఎక్కువ రోజు అర్జెంటీనాలో ఉన్నాననీ తెలిపాడు. ప్రస్తుతం ‘స్పెర్మ్ డోన్’ పనిమీద లండన్‌లో ఉన్నాననీ..ఫేస్‌బుక్ ద్వారా తనకు చాలా రిక్వెస్టులు వస్తుంటాయని తెలిపాడు. సాధ్యమైనంత మేరకు అందరికి సంతాన భాగ్యం కల్పిస్తానని చెప్పే జోయ్ 2500 మంది పిల్లలకు తండ్రి కావాలన్నది అతన జీవిత లక్ష్యంమట..!!