Vatican City : పోప్‌‌తో స్పైడర్ మ్యాన్

స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఓ వ్యక్తి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడిని చూడటానికి చిన్నారులు ఉత్సాహం చూపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచాడు. వాటికన్ సిటీలోని శాన్ దమాసో వేదికగా ఇది చోటు చేసుకుంది.

Vatican City : పోప్‌‌తో స్పైడర్ మ్యాన్

Spider Man And Meets Pope Vatican City

Updated On : June 24, 2021 / 4:40 PM IST

Spider Man : వాటికన్ సిటీ..ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో చిన్నారులు చికిత్స పొందుతున్నారు. రోగులు, వారి బంధువులతో ఆ ప్రాంతం హడావుడిగా ఉంది. అకస్మాత్తుగా స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఓ వ్యక్తి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చిన్నారులకు స్పైడర్ మ్యాన్ అంటో ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. అతడిని చూడటానికి చిన్నారులు ఉత్సాహం చూపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచాడు. వాటికన్ సిటీలోని శాన్ దమాసో వేదికగా ఇది చోటు చేసుకుంది. స్పైడర్ మ్యాన్ వేషధారణలో వచ్చిన వ్యక్తి…మాటియో విల్లార్డిటా.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరిచేందుకు స్పైడర్ మ్యాన్ వేషం వేసుకొని రావడం జరిగిందన్నారు. ఇతనితో పలువురు సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. అనంతరం వాటికన్ సిటీలో ఉన్న పోప్ ప్రాన్సిస్ ను కలిశారు. తలకు ధరించే స్పైడర్ మ్యాన్ మాస్క్ ను పోప్ కు ఇచ్చారు మాటియో. స్పైడర్ మ్యాన్ వేష ధారణలో ఉన్న మాటియో..పోప్ లు మాట్లాడుతున్న ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.

పోప్ ఫ్రాన్సిస్ ను కలవడం చాలా ఆనందంగా ఉందని, అనారోగ్యంతో ఉన్న​ చిన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం ప్రార్థించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ని కోరినట్లు మాటియో తెలిపారు. చిన్నారుల వద్దకు తాను వెళ్లినప్పుడు వారి బాధను మాస్క్‌ ద్వారా చూస్తున్నట్లు తెలియజేడానికి పోప్‌కు మాస్క్‌ ఇచ్చినట్లు వెల్లడించారు.