LTTE Chief Prabhakaran: ప్రభాకరన్ సజీవంగా ఉన్నాడన్న వాదనలపై స్పందించిన శ్రీలంక ప్రభుత్వం ..

2009లో శ్రీలంక సైన్యం ఎల్టీటీఈ ఆధిపత్య ప్రాంతంలో భారీ సైనిక దాడులను ప్రారంభించింది. ఇందులో ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ హతమైనట్లు తెలిపింది. ఆ సమయంలో శ్రీలంక సైన్యం ఒక చిత్రాన్ని కూడా విడుదల చేసింది. అందులో ఎల్టీటీఈ చీఫ్ మృతదేహాన్ని చూపించారు.

LTTE Chief Prabhakaran: ప్రభాకరన్ సజీవంగా ఉన్నాడన్న వాదనలపై స్పందించిన శ్రీలంక ప్రభుత్వం ..

LTTE Chief Prabhakaran

Updated On : February 13, 2023 / 3:34 PM IST

LTTE Chief Prabhakaran: ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ గురించి ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని నెడుమారన్ ప్రకటించిన విషయం విధితమే. తంజావూరులో సోమవారం మీడియాతో మాట్లాడిన నెడుమారన్ కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రభాకరన్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు, ప్రభాకరన్ అనుమతితోనే నేను ఈ ప్రకటన చేస్తున్నా అంటూ నెడూమరన్ సంచలన  వ్యాఖ్యలు చేశారు.

 

ప్రభాకరన్ బతికే ఉన్నాడని నెడూమరన్ చేసిన వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. నివేదికపై మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తుందని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ తెలిపారు. 2009లో శ్రీలంక సైన్యం ఎల్టీటీఈ ఆధిపత్య ప్రాంతంలో భారీ సైనిక దాడులను ప్రారంభించింది. ఇందులో ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ హతమైనట్లు తెలిపింది. ఆ సమయంలో శ్రీలంక సైన్యం ఒక చిత్రాన్ని కూడా విడుదల చేసింది. అందులో ఎల్టీటీఈ చీఫ్ మృతదేహాన్ని చూపించారు. అయితే ఇప్పుడు నెడూమరన్ వ్యాఖ్యల తరువాత దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

నెడూమరన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభాకరన్ కుటుంబ సభ్యులతో టచ్ లోనే ఉన్నానని తెలిపారు. శ్రీలంకలో రాజపక్సేపై సింహళీయుల తిరుగుబాటు కారణంగా ఇప్పుడు ప్రభాకరన్ బయటకు రావటానికి మంచి సమయం అని అన్న నెడూమరన్.. తమిళులంతా ప్రభాకరన్ కు మద్దతుగా నిలవాలని కోరారు. తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.