కొలంబోలో పేలుళ్లు : హోటల్‌లో చిక్కుకుపోయిన అనంతపురం వాసులు
శ్రీలంక రాజధాని కొలంబో వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఈస్టర్ పండుగ రోజున ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. బాంబు పేలుళ్లు,

శ్రీలంక రాజధాని కొలంబో వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఈస్టర్ పండుగ రోజున ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. బాంబు పేలుళ్లు,
శ్రీలంక రాజధాని కొలంబో వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఈస్టర్ పండుగ రోజున ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో రక్తపుటేరులు పారించారు. ఈ పేలుళ్లలో 200మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. చర్చిలు, హోటళ్లు టార్గెట్ గా దాడులు జరిగాయి. ఈస్టర్ ను పురస్కరించుకుని ప్రార్థనలు చేస్తుండగా చర్చిలలో పేలుళ్లు జరిగాయి. దీంతో శ్రీలంక వెళ్లిన అనేకమంది విదేశీయులు అక్కడ చిక్కుకుపోయారు. వారిలో ఏపీ రాష్ట్రానికి చెందిన అనంతపురం వాసులు కూడా ఉన్నారు. పేలుళ్ల తర్వాత షాంగ్రిలా హోటల్ లో తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి.
పేలుళ్ల సమయంలో కొందరు అనంతపురం వాసులు షాంగ్రీలా హోటల్ లో ఉన్నారు. బాస్ట్ తర్వాత హోటల్ నుంచి బయటపడేందుకు పర్యాటకులు పరుగులు తీశారు. దీంతో తోపులాట జరిగి కొందరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకి స్వల్పగాయాలై తెలుస్తోంది. నలుగురు స్నేహితులతో కలిసి ఆయన విహారయాత్రకు వెళ్లారు. వారి పాస్ పోర్టులు, ఇతర పత్రాలు హోటల్ గదిలోనే ఉండిపోయాయి. తమ వారు శ్రీలంకలో చిక్కుకుపోవడంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ వాళ్లు క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నారు. వారిని సురక్షితంగా తీసుకురావాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.