రెండో రోజు : శ్రీలంకలో మరో పేలుడు

స్పెషల్ టాస్క్ ఫోర్స్(ప్రత్యేక భద్రతా దళం) బాంబు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో చర్చికి దగ్గరగా పార్కింగ్ చేసి ఉన్న వాన్ పేలింది.

రెండో రోజు : శ్రీలంకలో మరో పేలుడు

Updated On : April 22, 2019 / 11:05 AM IST

స్పెషల్ టాస్క్ ఫోర్స్(ప్రత్యేక భద్రతా దళం) బాంబు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో చర్చికి దగ్గరగా పార్కింగ్ చేసి ఉన్న వాన్ పేలింది.

కొలంబొలో ఆదివారం వరుసగా పేలిన 9 బాంబు పేలుళ్లకు ఇంకా మృతదేహాల  ఖననం పూర్తి కాకముందే సోమవారం మరో బాంబు పేలి ప్రజల్లో భయాన్ని రెట్టింపు చేసింది. ఈ బాంబు కూడా చర్చిని టార్గెట్ చేసుకునే అమర్చారట. అయితే బాంబు నిర్వీర్యం చేసే క్రమంలో చిన్నపాటి పేలుడు సంభవించిందట. 
Also Read : యనమల వర్సెస్ బొత్స: టీడీపీ ఓడిపోతుంది.. అధికారులూ సహకరించకండి

ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం..’స్పెషల్ టాస్క్ ఫోర్స్(ప్రత్యేక భద్రతా దళం) బాంబు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో చర్చికి దగ్గరగా పార్కింగ్ చేసి ఉన్న వాన్ పేలింది’ అని తెలిపాడు. ఆదివారం 9 బాంబు పేలుళ్ల గురించి విన్న కొలంబో వాసులు ఆ శబ్దానికి పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు దగ్గర్లో ఉన్న ప్రదేశాలకు వెళ్లి తలదాచుకున్నారు. 

ప్రమాద స్థలమైన సెయింట్ ఆంటోనీ చర్చి సమీపంలో భద్రతా సిబ్బంది అధికారికంగా వివరాలు తెలియజేయడానికి అందుబాటులో లేరు. ఆదివారం జరిగిన ప్రమాద బాధితులను, ఘటనా స్థలాలను పరిశీలిస్తున్న జర్నలిస్టు ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. 

Also Read : ఆశ్చర్యపరిచిన ప్రియాంక గాంధీ: తానే స్వయంగా వంటగదిలోకి వెళ్లి!