SpaceX Starship Destroyed
Starship Destroyed: స్పేస్ఎక్స్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌పిష్ విఫలమైంది. టెక్సాస్ లోని బొకాచికా వేదికగా గురువారం సాయంత్రం 4.37గంటలకు (భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున 4గంటలకు) రాకెట్ ను ప్రయోగించారు. అయితే, నింగిలోకి దూసుకెళ్లిన ఎనిమిది నిమిషాల తరువాత రాకెట్ పేలిపోయింది. బూస్టర్ విడిపోయి లాంచ్ ప్యాడ్ కి తిరిగి చేరుకుంది. అయితే, రాకెట్ లోని ఆక్సిజన్ లీక్ కావడంతోనే పేలిపోయినట్లు తెలుస్తుంది. రాకెట్ పేలిపోయిన తరువాత శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాకెట్ పేలిపోవడంతో స్పేస్ ఎక్స్ స్పందించింది. ప్రయోగం విఫలం కావడానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం సేకరిస్తున్నట్లు పేర్కొంది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్ షిప్ విశ్వసనీయతను పెంచిందని తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇదిలాఉంటే.. ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన ఎనిమిది నిమిషాల తరువాత స్టార్ షిప్ రాకెట్ తో మేము కమ్యూనికేషన్ కోల్పోయామని, స్పేస్ ఎక్స్ కమ్యూనికేషన్స్ మేనేజర్ డాన్ హుట్ లైవ్ స్ట్రీమ్ లో తెలిపాడు.
స్టార్ షిప్ రాకెట్ పేలిపోయిన తరువాత శకలాలు నిప్పులు చిమ్ముకుంటూ సముద్రలోకి దూసుకెళ్తున్న వీడియోను స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. విజయం కాకపోయిన.. వినోదం మాత్రం గ్యారెంటీ అంటూ మస్క్ తన ట్వీట్ రాశారు.
Success is uncertain, but entertainment is guaranteed! ✨
pic.twitter.com/nn3PiP8XwG— Elon Musk (@elonmusk) January 16, 2025
🚨🇺🇸 BREAKING: SPACEX STARSHIP FLIGHT 7 ENDS WITH REENTRY OVER CARIBBEAN
SpaceX’s latest Starship test achieved new distance milestones before breaking up during reentry near Turks and Caicos.
The flight, which launched from Starbase at 4:37pm CST, marks another step in the… https://t.co/5OUfxjbJHn pic.twitter.com/mQ1WVUtHk5
— Mario Nawfal (@MarioNawfal) January 16, 2025