Afghanistan: ఆనాటి బహిరంగ కఠిన శిక్షలు మళ్లీ వస్తాయ్‌ : తాలిబన్లు

20 ఏళ్ల తరువాత అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఒకప్పుడు వారి పాలనలో అమలు చేసిన కఠిన శిక్షల్ని అమలు చేస్తామని చెబుతున్నారు.

Afghanistan Crisis : 20 ఏళ్ల తరువాత అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మళ్లీ తమ మార్కు పాలన ప్రారంభించారు. ఒకప్పుడు వారి పాలనలో శిక్షల్ని బహిరంగంగానే విధించేవారు. కాళ్లు నరికేయటం, చేతులు నరికేయటం వంటి పలు హింసాత్మక శిక్షల్ని అమలు చేసేవారు. అటువంటి శిక్షలపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతోమంది ఖండించారు కూడా. ఈ క్రమంలో తిరిగి అఫ్గాన్ నుస్వాధీనం చేసుకున్న తాలిబన్లు తిరిగి అదే శిక్షల్ని అలాగే అమలు చేస్తారా? అంటే అవుననే అంటున్నారు తాలిబన్ నేతలు.

ఒకప్పటిలా క్రూర విధానాలను తమ పాలనలో తిరిగి అమలు చేస్తామని చెబుతున్నారు. అఫ్గాన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత తాలిబన్లు ప్రపంచ దేశాల నిధుల కోసం ఎన్నో అబద్దాలు ఆడారు. గతంలో వలె ఉండమని..ప్రజా పాలన చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ తాలిబన్లు మారలేదని..మారేది లేదని వారు మహిళల విషయంలో వ్యవహరించే విధానమే చెప్పకనే చెబుతోంది. కానీ ఇది కేవలం అఫ్గాన్ లో తాలిబన్లమీద ఉన్న దురభిప్రాయం మాత్రమే అనుకునేవారికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎలాగంటే..మళ్లీ తమ మార్కు చూపించటంతో..అఫ్గానిస్థాన్‌లో 1990ల నాటి తరహాలోనే ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం, కళ్లు పెరికివేయటం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తూ మరోసారి తాలిబన్ల నిజస్వరూపాన్ని బయటపెట్టారు.

Read more : Afghan : తాలిబన్ల ఆరాచకం, కారు ఆపలేదని కాల్చి చంపేశారు

తాలిబన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా నూరుద్దీన్‌ తురాబీ తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. ”గతంలో మేం బహిరంగంగా శిక్షలను అమలు చేసినప్పుడు చాలా దేశాలు విమర్శలు గుప్పించాయి. కానీ మేం ఏదేశాలకు సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో కల్పించుకోలేదు. కాబట్టి మా అంతర్గత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకున్నా ఊరుకునేది లేదు అని స్పష్టంచేశారు. ఏ దేశానికి సంబంధించి శిక్షల్ని అమలు చేసే విషయంలో వారి వారి దేశాల చట్టాలను బట్టే అమలు చేస్తుంటారు. అలాగే మా చట్టాలు ఎలా ఉండాలో ఇతరులు చెప్పనక్కర్లేదు. అంటే ఏదేశాలు చెప్పనక్కరలేదు. విమర్శించనక్కర్లేదని తేల్చి చెప్పారు తాలిబన్లు.

Read more : Taliban Crisis : ఇళ్లు ఖాళీ చేసిపొమ్మంటున్న తాలిబన్లు..నిరసలు చేస్తున్న ప్రజలు

‘‘మేం ఇస్లాంను అనుసరిస్తాం. ఇస్లాం పవిత్ర గ్రంథం అయిన ఖురాన్‌ ప్రకారమే చట్టాలు రూపొందించుకుంటాం. వాటినే అమలు చేస్తాం. గతంలో మేం అవలంభించిన తరహాలోనే ఇప్పుడు కూడా దోషులను కఠినంగా శిక్షిస్తాం. చేతులు, కాళ్లు నరకడం వంటి శిక్షలను అమలు చేస్తాం. అయితే వాటిని బహిరంగంగా అమలు చేయాలా వద్దా అన్న దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి” అని తెలిపారు. తాలిబన్ల గత ప్రభుత్వంలో తురాబీ న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో అఫ్గాన్‌లో హంతకులను బహిరంగంగా కాల్చిచంపడం, దొంగల కాళ్లు-చేతులు నరకడం వంటి శిక్షలు అమల్లో ఉండేవి.

ఈ క్రమంలో మరోసారి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు అలనాటి శిక్షల్నే అమలు చేస్తామని చెబుతున్నారు. అంటే తాలిబన్ల పాలనలో అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులోంచి వణుకు పుట్టుకురావటం ఖాయం అనేలా ఉంది వారి శిక్షల గరించి చెప్పే విధానం చూస్తే.

ట్రెండింగ్ వార్తలు