Afghan : తాలిబన్ల ఆరాచకం, కారు ఆపలేదని కాల్చి చంపేశారు

అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. కారు ఆపలేదని ఓ వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా..కనికరం లేకుండా కాల్చి చంపేశారు.

Afghan : తాలిబన్ల ఆరాచకం, కారు ఆపలేదని కాల్చి చంపేశారు

Taliban

Taliban : అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. మనుషుల్లా వారు వ్యవహరించడం లేదు. దాష్టికాలకు తెగబడుతున్నారు. వ్యతిరేకిస్తున్న వారిని పిట్టల్లా కాల్చి చంపేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకు దారుణాలకు తెగబడుతున్నారు. కారు ఆపలేదని ఓ వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా..కనికరం లేకుండా కాల్చి చంపేశారు.

Read More : Taliban : అప్ఘాన్ వీడిన 5లక్షల మంది..మహిళలు,చిన్నారులే ఎక్కువ!

దీనికి సంబంధించిన వీడియో అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. ఇలాగా కూడ వ్యవహరిస్తారా ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అప్ఘానిస్తాన్ లో జరిగిన ఈ విషాద ఘటనపై రక్షణ నిపుణుడు కల్నల్ వి.ఎన్. థాపర్ (రిటైర్డ్) స్పందించారు. అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందడానికి మారిపోయినట్లు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో అమెరికా నిష్పలమైన ప్రయత్నాలు చేస్తోందని, అప్ఘాన్ లో ఉన్న ప్రజలపై ముఖ్యంగా మహిళలపై బీభత్సం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More : Syed Ahmad Shah Saadat : ఒకప్పుడు అప్ఘాన్ మంత్రి.. ఇప్పుడేమో పిజ్జా డెలివరీ బాయ్‌..!

ఆగస్టు 04వ తేదీన ఓ యువతి veil ధరించనందుకు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. నెల రోజుల తర్వాత..తాలిబన్లు ఆగస్టు 15వ తేదీన అప్ఘాన్ ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాల అనంతరం యూఎస్, నాటో దళాలు ఉపసంహరించుకున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ మరికొందరు అధికారులతో దేశం నుంచి పారిపోయారు. తాలిబన్లు వశం చేసుకోవడంతో వేలాది మంది కాబూల్ ఎయిర్ పోర్టుకు పరుగులు తీశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ యుద్ధావాతవరణం నెలకొంది.