Taliban Crisis : ఇళ్లు ఖాళీ చేసిపొమ్మంటున్న తాలిబన్లు..నిరసలు చేస్తున్న ప్రజలు

అఫ్గాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు కాందహార్ ప్రాంతంలోని సైన్యానికి చెందిన భూముల్లో నివసిస్తున్న ప్రజల్ని మూడు రోజుల్లో ఇళ్లు ఖాళీ పోవాలని హుకుం జారీ చేశారు.

10TV Telugu News

Taliban crisis : అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని బానిసల్లాగా..ముఖ్యంగా మహిళలను కనీసం మనుషులుగానే గుర్తించటంలేదు. అమెరికా బలగాలు అలా తరలివెళ్లిన వెంటనే తమ దూకుడు పెంచిన తాలిబన్లు అఫ్గాన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత వారి మార్క్ అరాచాలకు తెరలేపారు. ఈ క్రమంలో ఎంతోమంది దేశం వదిలిపారిపోయారు. ఇంకెంతోమంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు.అఫ్గాన్ ను ఆక్రమించిన తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా కాందహార్ ప్రాంతంలోని ప్రజలకు తాలిబన్లు ఇచ్చిన హుకుంలు పెద్ద వివాదానికి దారి తీస్తున్నాయి.

Read more : Afghanistan: అఫ్ఘానిస్తాన్‌కు చైనా సహాయంపై భారత్‌కు ఆందోళన అక్కర్లేదు -తాలిబాన్లు

కాందహార్ ప్రాంతంలోని అఫ్గాన్ జాతీయ సైన్యానికి చెందిన భూముల్లో చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ నివసించే ప్రజలంతా వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని తాలిబన్ ప్రభుత్వ నేతలు హుకుం జారీచేశారు. ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్లు ఖాళీ చేయటానికి మూడు రోజుల గడువు ఇచ్చారు. మూడు రోజుల తరువాత కూడా ఇళ్లు ఖాళీ చేయకపోతే మేమేంటో చూపిస్తామని హెచ్చరించారు.

Read more : Afghanistan: అఫ్ఘానిస్తాన్‌కు చైనా సహాయంపై భారత్‌కు ఆందోళన అక్కర్లేదు -తాలిబాన్లు

తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలను స్థానిక ప్రజలు ఏమాత్రం ఒప్పుకోవటంలేదు. తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. మేము ఇక్కడ 20 ఏళ్లుగా ఉంటున్నామని..పిల్లాపాలతో ఉన్నమేము ఎక్కడికి పోవాలి? ఈ ఇళ్లల్లో ఉండే హక్కు మాకు ఉంది మీరు పొమ్మంటే పోయేది లేదని తేల్చి చెబుతున్నారు.