Afghanistan: అఫ్ఘానిస్తాన్‌కు చైనా సహాయంపై భారత్‌కు ఆందోళన అక్కర్లేదు -తాలిబాన్లు

అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు అక్రమించుకున్న తర్వాత అక్కడి పరిణామాలపై ఇండియా సహా ప్రపంచదేశాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

Afghanistan: అఫ్ఘానిస్తాన్‌కు చైనా సహాయంపై భారత్‌కు ఆందోళన అక్కర్లేదు -తాలిబాన్లు

Taliban Manhunt Afghanistan

Afghanistan: అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు అక్రమించుకున్న తర్వాత అక్కడి పరిణామాలపై ఇండియా సహా ప్రపంచదేశాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియాకు పక్కలో బల్లెంగా మారిన చైనా, పాకిస్తాన్ దేశాలు అఫ్ఘానిస్తాన్ దేశంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలు భారత్ ఆందోళనలను పెంచుతున్నాయి. భారత్‌కు సంబంధించి, ఈ దేశాలు ఏ రకమైన అడుగులు వేస్తున్నాయి అనేది భారత్ ఆందోళన. తాలిబన్లు అనూహ్యంగా చైనాను తమకు అత్యంత మిత్రదేశంగా భావించడమే గాక, సంబంధాలు కూడా ప్రారంభించడంతో భారత్‌లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

అఫ్ఘానిస్తాన్ నిర్మాణంలో చైనా పాల్గొనడంలో తప్పులేదని, అవసరమైన రంగాలలో చైనా సహాయం అందిస్తుందని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ వెల్లడించారు. తాలిబాన్ మరియు చైనా సహకారం కోసం సుముఖత వ్యక్తం చేయడంతో, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద అఫ్ఘానిస్తాన్‌కు చైనా సహాయం చేయడంలో తప్పులేదని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ చెప్పారు.

సోనూసూద్ ఇల్లు, కంపెనీల్లో ఐటీ సోదాలు

“అఫ్ఘానిస్తాన్‌కు చైనా సహాయం చెయ్యడం విషయంలో భారతదేశం ఆందోళనలు సరైనవి కావు” అని గ్లోబల్ టైమ్స్ ప్రశ్నకు సుహైల్ షాహీన్ సమాధానం చెప్పారు. కొన్ని భారతీయ మీడియా సంస్థలు.. BRI కింద చైనా సహకారం అందించడమే, భారతదేశం ఆందోళనకు కారణమని సుహైల్ షాహీన్‌ చెప్పారు. “మన దేశం మరియు మన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మేము ఇతర దేశాలతో కలిసి పని చేస్తున్నాము. ఇతర దేశాలతో మనం ఏర్పరచుకునే ప్రతి సంబంధమూ మన పరస్పర స్వప్రయోజనాల ప్రాతిపదికన విజయం సాధించేందుకు సాయం చేస్తుందని అన్నారు.

అఫ్ఘానిస్తాన్‌లో మరోసారి వేళ్లూనుకోనున్న అల్-ఖైదా, అమెరికాపై 1-2 ఏళ్లలో దాడి!

ఇది మా దేశానికి సంబంధించిన అంతర్గత విధానమని, భారతదేశం ఈ విషయంలో ఆందోళనలు చేయడం సరికాదని అన్నారు. ఆక్రమణ పూర్తయ్యాక.. మేము ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టామని, ఈ విషయంలో మాకు చైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది అని, భవిష్యత్తు చైనా ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం ఉద్యోగాలు సృష్టిస్తుందని, అందులో తప్పేముంది?”అని తాలిబాన్ ప్రతినిధి అన్నారు.