Afghanistan: అఫ్ఘానిస్తాన్‌లో మరోసారి వేళ్లూనుకోనున్న అల్-ఖైదా, అమెరికాపై 1-2 ఏళ్లలో దాడి!

అఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించగలిగామని అమెరికా చెప్పినప్పటికీ యూఎస్ పై మరో ఒకట్రెండు సంవత్సరాల్లో దాడి జరిగే..

10TV Telugu News

Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించగలిగామని అమెరికా చెప్పినప్పటికీ యూఎస్ పై మరో ఒకట్రెండు సంవత్సరాల్లో దాడి జరిగే అవకాశం ఉందని యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఎలా అంటే ఆల్ ఖైదా ఉగ్రవాదాన్ని మరో రెండేళ్లలో పున: నిర్మించే అవకాశాలు ఉన్నాయని సీనియర్ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుత అంచనా ప్రకారం.. ఒకట్రెండు సంవత్సరాల్లో దేశాన్ని బెదిరించడానికి ఆల్ ఖైదా సామర్థ్యం పెంచుకోగలదని బ్లూమ్‌బెర్గ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్‌ను చెబుతున్నారు.

మంగళవారం ఇంటెలిజెన్స్ కాన్ఫిరెన్స్‌లో మాట్లాడిన లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెర్రియర్ ‘అన్ని రకాలుగా తిరిగి పుంజుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు.

Read Also: PM Modi: “పీఎం మోదీ పంపారు.. డబ్బులు తిరిగిచ్చేదే లేదు”

అఫ్ఘానిస్తాన్ నుంచి బలాలను వెనక్కు తీసుకున్న అమెరికా జాతిని నిర్మించలేకపోయింది. అమెరికా మెయిన్ టార్గెట్ 9/11 దాడులకు కారణమైన మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించడమేనని ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు.

ఈ ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారాన్ని సీఐఏ డిప్యూటీ డైరక్టర్ డేవిడ్ కొహెన్ ధ్రువీకరించారు. మరో ఒకట్రెండు సంవత్సరాల్లో ఆల్ ఖైదా తిరిగి పుంజుకుంటుందనే కార్యచరణ కనిపిస్తుందని అన్నారు.

 

10TV Telugu News