Viral Video
Viral Video : గురు శిష్యుల అనుబంధం ఎంతో గొప్పది. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శిష్యులు జీవితకాలం మర్చిపోరు. తమ జీవితంలో విజ్ఞానపు వెలుగులు నింపిన గురువు క్యాన్సర్ సోకి ప్రాణాలతో పోరాడుతుంటే ఆయన దగ్గర చదువుకున్న విద్యార్ధులు తట్టుకోలేకపోయారు. ఏకంగా 400 మంది విద్యార్ధులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఏమైంది?
Viral Video
Ayodhya Ram Mandir : అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..
తమకు చదువు చెప్పే మాస్టారు క్యాన్సర్‌తో పోరాడుతుంటే ఆయన దగ్గర చదువుకున్న విద్యార్ధులు అది తట్టుకోలేకపోయారు. 400 మంది విద్యార్ధులు ఆ మాస్టారు ఇంటి ముందు నిలబడి శ్లోకాలు, పాటలతో ప్రార్థనలు చేసారు. కన్నీరు పెట్టుకున్నారు. ఇదంతా భవనం పైనుండి ఆ మాస్టారు చూస్తూ ఉండిపోయారు. కళ్లు చమర్చే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో యూఎస్ టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో ఉన్న క్రైస్ట్ ప్రెస్బిటేరియన్ అకాడమీ నుండి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video 2
Devil Fruit : అయ్యబాబోయ్.. ఇదేం నిమ్మకాయ? ఇంటర్నెట్‌ను భయపెట్టిన వింత ఫ్రూట్
Viral Video 3
బెన్ ఎల్లిస్, క్రైస్ట్ ప్రెస్‌బిటేరియన్ అకాడమీలో అంకితభావంతో ఉన్న విద్యావేత్త. ఆయనకు క్యాన్సర్ సోకడంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన పట్ల అభిమానం, గౌరవం ఉన్న విద్యార్ధులు ఈ విషయాన్ని తట్టుకోలేకపోయారు. క్యాన్సర్ నుండి ఆయన కోలుకోవాలని కోరుకుంటూ విద్యార్ధులు, సిబ్బంది సైతం ప్రదర్శనగా బెన్ ఎల్లిస్ ఇంటికి చేరుకున్నారు. నిజానికి ఇది పాత వీడియో. కానీ ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతోంది. విద్యార్ధులు వచ్చి వెళ్లిన 10 రోజులకు బెన్ ఎల్లిస్ కన్నుమూసారట. ఆయన అప్పటికే అన్నవాహిక క్యాన్సర్‌తో తీవ్రంగా పోరాడుతున్నారు. ఎంతోమంది విద్యార్ధులకు పాఠాలు నేర్పిన బెన్ ఎల్లిస్ క్యాన్సర్‌ను జయించలేకపోయారు. ఈ వైరల్ వీడియో ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసుల్ని హత్తుకుంది. మానవత్వం ఉందని రుజువు చేసింది. @historyinmemes అనే ట్విట్టర్ యూజర్ రీసెంట్ గా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
400 students gather outside the home of their cancer-stricken teacher to sing for him. He passed away 10 days later pic.twitter.com/raYmpK1196
— Historic Vids (@historyinmemes) January 18, 2024