Devil Fruit : అయ్యబాబోయ్.. ఇదేం నిమ్మకాయ? ఇంటర్నెట్‌ను భయపెట్టిన వింత ఫ్రూట్

ఒక్కోసారి చెట్లకి వింతగా పూలు, కాయలు కాయడం గురించి విన్నాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వింత నిమ్మకాయను చూడండి. మునుపెన్నడూ ఇలాంటిది మీరు చూసి ఉండరు.

Devil Fruit : అయ్యబాబోయ్.. ఇదేం నిమ్మకాయ?  ఇంటర్నెట్‌ను భయపెట్టిన వింత ఫ్రూట్

Devil Fruit

Devil Fruit : సాధారణంగా నిమ్మకాయ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. కానీ ఓ చెట్టుకి వింతగా కాసింది. చూడటానికి భయంకరంగా అనిపించిన ఆ నిమ్మకాయ వీడియోను ఆ చెట్టు యజమాని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

Lemon Water : ప్రతి రోజు నిమ్మకాయ నీరు తాగుతున్నారా?… అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే !

సోషల్ మీడియాలో ఎన్నో వింతలు విడ్డూరాలకు సంబంధించిన రీల్స్, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటిదో ఒక వీడియో బయటకు వచ్చింది. అది ఒక నిమ్మకాయకి సంబంధించినది. 25 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న ఆ వీడియోలో నిమ్మకాయకి అంత ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా? మాక్సిన్ షార్ఫ్ (Maxine Sharf) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వింత నిమ్మకాయ అందర్నీ భయపెట్టింది. ఎందుకంటే అలాంటి నిమ్మకాయను మీరింతవరకు చూసి ఉండరు. వాళ్ల గార్డెన్‌లోనే కాసిన ఈ నిమ్మకాయ పసుపు పచ్చని రంగులో పెద్దదిగా.. వింత షేప్‌లో ఉంది. మాక్సిన్ షార్ఫ్ దానిని కట్ చేసి వీడియోలో చూపించారు.

Secret to White Teeth : నిమ్మ తొక్క తో మీ దంతాలను తెల్లగామారేలా చేయటం వెనుక రహస్యం తెలుసా ?

ఈ వింత నిమ్మకాయ పై భాగమే భయంకరంగా ఉంటే లోపలి భాగం మరింత విచిత్రంగా ఉంది. రెగ్యులర్ నిమ్మకాయకు భిన్నంగా కనిపించిన ఈ వింత నిమ్మకాయను చూసి జనం భయమేస్తోందంటూ కామెంట్స్ చేసారు. కొంతమంది మాత్రం చూడటానికి బావుందని కూడా చెప్పారు. ఇక ఈ వింత నిమ్మకాయను ఫోటో తీసి మీ కిచెన్‌లో వేలాడదీస్తే ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంటుందని కూడా సలహా ఇచ్చారు. మొత్తానికి ఈ వింత నిమ్మకాయ మాత్రం వెరైటీగా ఉంది. మాక్సిన్ షార్ఫ్ వీడియోకి లక్షల్లో వ్యూస్ తెచ్చిపెడుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Maxine Sharf (@maxiskitchen)