Lemon Side Effects: నిమ్మ రసం తాగుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే..

నిమ్మకాయ నీటిని పదేపదే తాగితే మూత్రం అధికంగా వస్తుంది. శరీరంలోని నీరు బయటకు వెళుతుంది. ఈ క్రమంలో శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి.

Lemon Side Effects: నిమ్మ రసం తాగుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే..

నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవి కాలంలో వేడి నుండి ఉపశమనం పొందడానికి నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. బరువును కూడా నియంత్రించటంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను తొలగించటంలో సహాయపడుతుంది.

అయితే అధికంగా నిమ్మకాయ నీరు తాగితే దుష్ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా? బరువు తగ్గడానికి లెమన్ వాటర్ మోతాదుకు మించి విచక్షణారహితంగా తాగుతున్నవారు దాని దుష్ప్రభావాలు గురించి తెలుసుకోవాల్సిందే.

నిమ్మరసం అధికంగా తాగితే సైడ్ ఎఫెక్ట్స్

1. నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఎందుకంటే ఇది ప్రోటీన్ విడగొట్టే ఎంజైమ్ అయిన పెప్సిన్‌ని సక్రియం చేస్తుంది. అదే సమయంలో, దాని అధికంగా తీసుకోవటం వల్ల పెప్టిక్ అల్సర్ వస్తుంది. ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది.

2. లెమన్ వాటర్ పదే పదే తాగడం వల్ల డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం ఏర్పడుతుంది. నిమ్మకాయ నీటిని తాగినప్పుడు మూత్రం అధికంగా వస్తుంది. శరీరంలోని నీరు బయటకు వెళుతుంది. ఈ క్రమంలో శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. దీంతో డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పొటాషియం లోపం ఏర్పడుతుంది.

3. నిమ్మ రసం తరుచూ తాగుతుంటే అధిక మొత్తంలో విటమిన్ సీ రక్తంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

4. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీంతోపాటుగా తగినంత మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో స్ఫటికాల రూపంలో పేరుకుపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

5. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిమ్మకాయలో ఎసిడిటీ ఉంటుంది. దీని వల్ల ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

6. లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. నిమ్మకాయలో అధిక మొత్తంలో యాసిడ్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది.

7. టాన్సిల్ సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగరాదు. ఎందుకంటే అలా చేయడం వల్ల హానికలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రీసెర్చ్ ప్రకారం, నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటే, అది గొంతు నొప్పికి కారణమవుతుంది.

Reas Also: ఆడిసన్స్ వ్యాధితో బాధపడ్డ స్టార్ హీరోయిన్.. చిన్నప్పటి విషయాలు గుర్తు రావడం లేదట..