పిల్లల్లోని ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థల మధ్య బేధాలు పిల్లలను పలు వ్యాధులబారిన పడకుండా ఎలా కాపాడతాయి. కొవిడ్ 19 కారణంగా పెద్ద వాళ్లలో వచ్చే సమస్యలకు వీరికి తేడా ఏంటి. ఈ ప్రాణాంతక వ్యాధి వెనుక జరిగే బయోలాజికల్ ప్రోసెస్ గురించి రీసెర్చ్ ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
అమెరికాలోని హూస్టన్‌లో ద యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ ప్రకారం.. అమెరికా జనాభాలో 18ఏళ్లు కంటే తక్కువ ఉన్నవాళ్లే 22శాతం ఉన్నారు. దాంతో పాటు ఈ ఏజ్ గ్రూప్ ఉన్నవారిలో అంటే లక్షా 49వేల 82మందిలో కేవలం 1.7శాతం మాత్రమే COVID-19మహమ్మారి బారిన పడ్డారు.
సంక్రమించే రోగ లక్షణాలు, హాస్పిటలైజేషన్, మరణాల శాతం ఊహించిన దానికంటే తక్కువ ఉన్నట్లు గుర్తించాం. దీని కోసం మరిన్ని వైద్య పరీక్షలు చేయాలి. థెరఫీ చేసే ఏజెంట్లను గుర్తించాలి’ అని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియోలజీ రీసెర్చర్స్ ఊపిరితిత్తుల కణ వ్యవస్థ, అణువుల పరిణామ వ్యవస్థపై ఓ కథనం రాశారు.
మనుషుల్లో ఉండే అణువులను ఏంజియోటెన్సిన్ ఎంజైమ్ 2లుగా మార్చేవి లేదా ACE2లు అని అంటారు. ఇవే నోవల్ కరోనావైరస్ కు డోర్లుగా పనిచేస్తాయి. ఇవి పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నపిల్లల్లోనే తక్కువగా కనిపిస్తాయి. ACE2లు వైరస్ ఎంటర్ అవడానికి చాలా కీలకం. పిల్లల్లో ఇవి తక్కువ. అవి వయస్సును బట్టి పెరుగుతుంటాయని యూటీ హెల్త్ సహ రచయిత మాథ్యూ హార్టింగ్ అన్నారు.
ACE2ల కథనం ప్రకారం.. పిల్లల్లోని వ్యాధినిరోధక వ్యవస్థ పెద్దవాళ్ల కంటే భిన్నంగా రెస్పాండ్ అవుతుంది. ఇదే పిల్లల్లో వ్యాధి రావడానికి తక్కువ అవకాశం ఉండేలా చేస్తుంది. పిల్లల్లో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ టీ సెల్స్ తిరిగి పుంజుకుని కరోనా నుంచి పోరాడేందుకు ఉపయోగపడుతుంది.
శరీరంలో ఉండే టీ సెల్స్ పరిణామం బట్టి కణాల మధ్య సిగ్నలింగ్ వ్యవస్థను ఇంటర్‌ల్యూకిన్ 10(IL-10) అంటారు. దీన్నే హ్యూమన్ సైటోకిన్ సింథసిస్ ఇన్హిబిటరీ కారకం అంటారు. సైంటిస్టుల నమ్మకం ప్రకారం.. పెద్ద వాళ్లు, పిల్లలతో పోలిస్తే.. వైరస్ ప్రవర్తనా తీరు పిల్లల కంటే పెద్దల్లోనే ప్రమాదకరమని.. వయస్సు పైబడ్డ వారిలో మరింత డేంజర్ అని అంటున్నారు.