Stuntman Died: ప్రపంచ రికార్డ్‌ కోసం ఫీట్‌.. ప్రాణం పోయింది

అలెక్స్ స్టంట్ కోసం ప్రయత్నిస్తూ.. మృతి చెందినట్లు గ్రాంట్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధ్రువీకరించింది. కాగా ఇప్పటికే హార్విల్ ఓ ప్రపంచ రికార్డ్ సాధించారు. జూలై 2013లో హార్విల్ మోటారుసైకిల్‌పై 297 అడుగుల పొడవైన డర్ట్-టు-డర్ట్ రాంప్ జంప్ తో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించాడు.

Stuntman Died: ప్రపంచ రికార్డ్‌ కోసం ఫీట్‌.. ప్రాణం పోయింది

Stuntman Died

Updated On : June 22, 2021 / 2:02 PM IST

Stuntman Died: వరల్డ్ రికార్డ్ కోసం బైక్ స్టంట్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వాషింగ్టన్‌లోని మోసెస్‌ లేక్‌ విమానాశ్రయంలో గురువారం చోటు చేసుకుంది. అలెక్స్ హార్విల్(28) అనే యువకుడు 351 అడుగులు బైక్ పై జంప్‌ చేసి గిన్నిస్‌ రికార్డ్‌ బద్దలు కొట్టాలనుకున్నాడు.

జంప్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. వేగంగా మోటార్ సైకిల్ ర్యాప్ పై వచ్చి జంప్ చేశాడు ల్యాండింగ్ సమయంలో బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయాడు.. తీవ్రగాయాలపాలై అక్కడే చనిపోయాడు. ఇతడి మరణం డర్ట్ బైక్ జంపింగ్ డేర్ డెవిల్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.