Suicide Bombers Attack: పాక్‌లో పోలీసుల వాహనంపై ఆత్మాహుతి బాంబర్లు దాడి.. ముగ్గురు మృతి, 23మందికి గాయాలు

పశ్చిమ పాకిస్తాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించగా, 23మంది గాయపడ్డారు. ఈ దాడులకు ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) బాధ్యత వహించింది.

Suicide Bombers Attack: పాక్‌లో పోలీసుల వాహనంపై ఆత్మాహుతి బాంబర్లు దాడి.. ముగ్గురు మృతి, 23మందికి గాయాలు

Pakistan

Updated On : November 30, 2022 / 1:07 PM IST

Suicide Bombers Attack: పశ్చిమ పాకిస్తాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించగా, 23 మంది గాయపడ్డారు. ఈ దాడులకు ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) బాధ్యత వహించింది. ఎన్‌కౌంటర్ సందర్భంగా జరిగిన భీకర కాల్పుల్లో పది మంది ఉగ్రవాదులతో పాటు అత్యంత విలువైన టిటిపి కమాండర్ మరణించిన రెండు రోజులకే ఈ దాడి జరిగిందని పాక్ భద్రతా వర్గాలు తెలిపాయి.

Pakistan Drone Shot Down : భారత్ లోకి ప్రవేశించిన పాక్ డ్రోన్‌ కూల్చివేత

దేశవ్యాప్తంగా సోమవారం ప్రారంభించిన టీకా కార్యక్రమంలో భాగంగా పోలీసులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో దాడి జరిగిందని సీనియర్ పోలీసు అధికారి గులామ్ అజ్ఫర్ మెహసర్ తెలిపారు. బాంబు దాడిలో సమీపంలోని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు కూడా ధ్వంసమైందని ఆయన అన్నారు. బలూచిస్తాన్‌లో దాడిలో తమ మాజీ ప్రతినిధి అబ్దుల్ వలీ హత్యకు ప్రతీకారంగా పోలీసులను లక్ష్యంగా చేసుకున్నట్లు టీటీపీ తెలిపింది.

Pakistan PM Shehbaz Sharif: ఇన్నాళ్లకు బోధపడిందా! ఉగ్రవాదమే పాకిస్థాన్‌కు ప్రధాన సమస్యగా మారిందన్న ప్రధాని షెహబాజ్

నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ దాడికి బాధ్యత వహించింది. మిలిటెంట్ గ్రూప్ ప్రభుత్వంతో కాల్పుల విరమణను రద్దుచేసి, దేశవ్యాప్తంగా దాడులు చేయాలని తమ పోరాట యోధులను కోరిన ఒకరోజు తర్వాత ఈరోజు పేలుడు జరిగిందని నివేదిక పేర్కొంది. పేలుడులో పోలీసు ట్రక్కుతో సహా మూడు వాహనాలు, సమీపంలోని రెండు కార్లు ధ్వంసమైనట్లు అధికారి తెలిపారు.