Pakistan Drone Shot Down : భారత్ లోకి ప్రవేశించిన పాక్ డ్రోన్‌ కూల్చివేత

భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్‌ కూల్చివేశారు. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ దళాలు కూల్చివేశాయి. అమృత్‌సర్‌ రూరల్‌ జిల్లా చహర్‌పూర్‌ ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన భద్రతా బలగాలు ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టాయి.

Pakistan Drone Shot Down : భారత్ లోకి ప్రవేశించిన పాక్ డ్రోన్‌ కూల్చివేత

Pakistan drone shot down

Updated On : November 29, 2022 / 11:00 AM IST

Pakistan Drone Shot Down : భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్‌ కూల్చివేశారు. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ దళాలు కూల్చివేశాయి. అమృత్‌సర్‌ రూరల్‌ జిల్లా చహర్‌పూర్‌ ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన భద్రతా బలగాలు ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టాయి. సరిహద్దు కంచె వైప ఉన్న పొలంలో డ్రోన్‌ పడిపోయిందని, అందులో తెలుపు రంగు పాలిథిన్‌ కవర్‌లో అనుమానాస్పద వస్తువుతోపాటు పాక్షికంగా దెబ్బతిన్న ఒక హెక్సాకాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ పీఆర్‌వో పేర్కొన్నారు.

కాగా, సోమవారం రాత్రి కశ్మీర్‌లోని సాంబా సరిహద్దు రాజ్‌పురా ప్రాంతంలో గుర్తుతెలియని డ్రోన్‌ సంచరించింది. ఎరుపు – పసుపు లైట్లతో వింత వస్తువు ఎగురుతూ కనిపించగా.. డ్రోన్‌ కదలికగా అంచనా వేస్తున్నారు. ఈ నెల 25న సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దులో డ్రోన్‌లు జారవిడిచిన ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Shoots Down Pakistan’ Drone : భారత్‌లోకి అక్రమంగా చొరబడిన పాక్ డ్రోన్‌ కూల్చివేత

ఐఈడీతోపాటు చైనాలో తయారైన రెండు పిస్టల్స్‌తోపాటు భారీ మొత్తంలో బుల్లెట్లు, ఐదు లక్షల భారత కరెన్సీ ఉన్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు సరిహద్దు ఆవల నుంచి ఆయుధాలు, డబ్బును పంపినట్లు అనుమానిస్తున్నారు.